Monday, April 29, 2024

ఆకాశమే హద్దుగా ఆదర్శ పాలన

- Advertisement -
- Advertisement -

It has been three years since KCR took over as CM for second time

ప్రజల నాడి తెలిసిన నేత
రైతుబంధు నుంచి దళితబంధు వరకు వినూత్న పథకాలతో జనానంద పాలన అందిస్తున్న అనితర, అసమాన ప్రభుత్వ సారథి

అభివృద్ధి, సంక్షేమాల్లో అనితర సాధ్యమైన శిఖరాల అధిరోహణ, ఐటిలో అత్యుత్తమ పనితీరు, ముఖ్యమంత్రి కెసిఆర్ రెండవ విడత మూడేళ్ల పాలనలో తెలంగాణ ప్రగతి వీణ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన 2014-2015లో1.31 కోట్ల ఎకరాలలో పంటలు సాగుకాగా, అది 2020-2021లో 2.30 కోట్ల ఎకరాలకు చేరింది. వరిసాగులో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలిచింది. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్లు ఏడేళ్ళ కింద 24.27 లక్షల టన్నులు కాగా, ప్రస్తుతం 1.42 కోట్ల టన్నులు. రైతున్నలకు పెట్టుబడి సాయంగా రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ.5వేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం చేస్తోంది. రైతు మరణిస్తే ఆకుటుంబానికి రైతు బీమా పథకం కింద రూ.5లక్షల ఆర్ధిక సాయం అందిస్తోంది. ఈ పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు జరగడం లేదు. ఈ పథకాలు కేంద్రం నుంచి పలుమార్లు ప్రశంసలను అందుకున్నాయి. సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.

మన తెలంగాణ/హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా కె. చంద్రశేఖర్‌రావు రెండవసారి అధికారం చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి అవుతోంది. సరిగ్గా మూడేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టిఆర్‌ఎస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించిన కెసిఆర్ రెండవ పర్యాయం ముఖ్యమంత్రిగా డిసెంబర్ 13వ తేదీన రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 1.25 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మూడేళ్ల పాలనలోనూ ప్రజలకు జనరంజకమైన పాలన అందించగలిగారు. ప్రజలకు మరింత చేరువుగా పాలనను తీసుకెళ్లగలిగారు. ఒక వైపు సంక్షేమ పథకాలు….మరోవైపు అభివృద్ధి పథకాలతో రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు పరుగులు తీయించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుపగలిగారు. దేశానికే ఒక రోల్‌మోడల్‌గా తెలంగాణను నిలబెట్టారు. ఫలితంగా రాష్ట్రానికి ఎన్నో ప్రశంసలు లభించాయి. పెద్దఎత్తున అవార్డులు…రివార్డులు దక్కాయి.

వాస్తవానికి ఈ మూడేళ్లలో అనేక ప్రతికూల పరిస్థితులు తలెత్తాయి. వరసగా ఎన్నికలు జరగడంతో కొన్ని నెలల పాటు రాష్ట్రం ఎన్నికల కోడ్‌లో బంధీ అయింది. ఇక కరోనా మహమ్మారి. దీనికి ప్రపంచ దేశాలు సైతం గజగజ వణికిపోయింది. నెలల పాటు లాక్‌డౌన్‌లు విధించుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మన దేశంలో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. అయినప్పటికీ రాష్ట్రంలో జోడెద్దుల వల్లే సంక్షేమం…అభివృద్ధి నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఇది కెసిఆర్ పాలన…దక్షతకు గీటురాయిగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజల నాడిని ఇట్టే పసిగట్టడంలో కెసిఆర్‌కు తెలిసినంతగా బహుషా దేశంలో మరే ముఖ్యమంత్రికి కూడా తెలిదంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అందుకే ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా అది అతి పెద్ద సంచలనానికి దారితీయడం సర్వసహజం. ఎలాంటి ప్రకటన చేసినా అది దేశ…..రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తుంటాయి.

అంతలా ప్రభావితం చేయడం ఒక కెసిఆర్‌కు చెల్లుతుంది. ఇందులో కేవలం రాజకీయ వ్యూహాలే కాదు…పాలనలోనూ ఆయన తనదైన పద్దతిలో కొనసాగిస్తున్నారు. కరోనా మహమ్మారితో ఎన్నో దేశాలు…రాష్ట్రాలు ఆర్ధికంగా పూర్తిగా చతికిలపడ్డాయి. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడింది. అయినప్పటికీ రాష్ట్రంలో ఎక్కడా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలుగలేదు. ఈ పరిస్థితి రాకుండా సిఎం కెసిఆర్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. దీని కారణంగానే మన రాష్ట్రం ఆర్ధికంగా స్వల్ప ఒడిదుడుకులకు లోనైంది. వాస్తవానికి కరోనా వల్ల కొన్ని రాష్ట్రాలు అయితే ప్రభుత్వ ఉద్యోగులకు కొంతకాలం జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. మన రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా కెసిఆర్ కరోనాను శరవేగంగా కట్టడి చేయగలిగారు. ముఖ్యంగా నగరంలోని గాంధీ ఆసుపత్రిని కోవిడ్ నోడల్ ఆసుపత్రిగా తీర్చిదిద్దారు. ప్రత్యేకంగా టిమ్స్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. చెస్టు ఆసుపత్రి, ఫీవర్ ఆసుపత్రి తదితర ఆసుపత్రులకు కోవిడ్ చికిత్సను విస్తరింప చేశారు.

అలాగే ఆక్సిజన్ పడకలు, వైద్య పరికరాలు, టెస్టింగ్ సామాగ్రిని సమకూర్చారు. బ్లాక్ ఫంగస్‌కు సంబంధించిన అత్యంత ఖరీదైన డ్రగ్స్ కొరత రాకుండా అధికారులతో ఒక కమిటి ఏర్పాటు చేశారు. వీటితో పాటు దేశంలోనే తొలిసారిగా యుద్ద విమానాల ద్వారా ఆక్సిజన్ తీసుకొచ్చారు.ఈచర్యలే ప్రస్తుతం మన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సురక్షింతగా కాపాడగలిగిందని ప్రత్యర్ధులు సైతం అంగీకరిస్తారు. దీనిని బట్టే కెసిఆర్ ఆలోచనలు…వ్యూహాలు ఎంత పకడ్బందిగా ఉంటాయో ఊహించవచ్చు. ఇక సంక్షేమ పథకాల అమలులో కూడా ఎక్కడా…ఎలాంటి అవాంతరాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా వివిధ వర్గాలకు ఇచ్చే పెన్షన్లు… కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, కెసిఆర్ కిట్ వంటి పథకాలకు నిధుల కొరత లేకుండా కెసిఆర్ చూశారు. ఫలితంగా సంక్షేమ పథకాలు సైతం ప్రతికూల పరిస్థితుల్లోనూ నిరాటంకంగా అమలు జరుగుతున్నాయి.

2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఇవిముగిసిన వెంటనే అదే సంవత్సరంలో లోక్‌సభ ఎన్నికలు, తదనంతరం అక్టోబర్‌లో హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగింది. 2020 చివరిలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగింది. ఆ తరువాత జిహెచ్‌ఎంసి ఎన్నికలు జరిగాయి. దీంతో కెసిఆర్ తన రెండొవ సారి పాలనలో అనేక సవాళ్లు, అడ్డంకులను ఎదుర్కొన్నారు. ఈ ప్రక్రియ ముగియగానే గ్రాడ్యుయేట్ ఎంఎల్‌సి ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు జరగగా….ఏప్రిల్ 2021లో నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగింది. కాగా రెండు నెలల క్రితం అక్టోబర్ 2021లో హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికతో పాటు ఈ మధ్యే స్థానిక సంస్థల పరిధిలో ఎంఎల్‌సి ఎన్నికలు కూడా జరిగాయి.

ఇలా గత మూడేళ్లలో వరుస ఎన్నికల కారణంగా దశలవారీగా చాలా నెలల పాటు అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి, కొత్త అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రారంభించే నిర్ణయాలు తీసుకోకుండా అడ్డుపడ్డాయి. మార్చి 2019లో కోవిడ్ మొదటి వేవ్, ఏప్రిల్ 2020లో రెండవ వేవ్ వల్ల నెలల పాటు లాక్‌డౌన్‌లు, వ్యాపార పరిమితుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి. దీని ఫలితంగా రాష్ట్ర ఖజానాకు రూ. 1 లక్ష కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా. ప్రస్తుతం కోవిడ్ పరిస్థితి అదుపులోకి రావడంతో మిగిలిన రెండేళ్ల పదవీకాలానికి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వేగవంతం చేయాలని గులాబీ బాస్ సిఎం కెసిఆర్ నిర్ణయించారు. గత మూడేళ్లలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో చిన్నపాటి ఎదురుదెబ్బలు తప్ప.. డిసెంబర్ 2018 నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేసింది.

ఆగని అభివృద్ధి పథకాలు

కరోనా…వరుస ఎన్నికలతో పాలనలో కొన్ని ఇబ్బందులు తలెత్తినా అభివృద్ధి…సంక్షేమ పథకాల అమలుపై ఎటువంటి ప్రభావం పడకుండా కెసిఆర్ అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రధానంగా దళిత సాధికారత కోసం ఆయన ప్రవేశపెట్టినదళిత బంధు పథకం యావత్ దేశాన్ని అబ్బురపరిచేలా చేసింది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టులో భాగంగా దళిత బంధును సిఎం కెసిఆర్ ఆగస్టు 16, 2021న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని శాలపల్లిలో లాంఛనంగా ప్రారంభించారు. దీని కింద ఒక్కొక్క దళిత కుటుంబానికి ఉచితంగా పది లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది. త్వరలోనే ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని సిఎం కెసిఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. కేవలం దళితులకే కాకుండా అన్ని వర్గాల్లోని పేదలకు ఇలాంటి దళిత బంధు వంటి పథకాలను అమలు చేస్తామన్నారు. అలాగే ఒకప్పుడు వ్యవసాయం దండుగ అన్న రంగాన్ని ఇప్పుడు పండుగ చేశారు. సిఎంగా కెసిఆర్ వచ్చిన తరువాత తెలంగాణలో వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయింది.

అంతలా వ్యవసాయం రంగం అభివృద్ధి చెందింది అంటే… అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూత….ప్రొత్సాహమే ప్రధాన కారణం. వ్యవసాయ రంగానికి అవసరమైన కరెంటును ఇరవై నాలుగు గంటల పాటు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అలాగే సాగునీటిని కూడా పుష్కలంగా అందిస్తున్నారు. ప్రధానంగా మిషన్ కాకతీయ, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో వ్యవసాయం నిండుగా సాగుతోంది. దీని కారణంగా సాగు విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గా ఏర్పడిన 2014..2015లో వ్యవసాయం సాగు 1.31 కోట్ల ఎకరాల పంటలు సాగుకాగా, 20202021లో 2.30 కోట్ల ఎకరాలకు చేరింది. దీంతో దేశంలో వరిసాగులోనే తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో నిలిచింది. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ఏడేళ్ళ కింద 24.27 లక్షల టన్నులు కాగా… ప్రస్తుతం 1.42 కోట్ల టన్నులకు చేరింది. అలాగే రైతున్నలకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకం కింద ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం ఐదువేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తోంది. ఒకవేళ ఏదైనా కారణంగా రైతు మరణిస్తే ఆకుటుంబానికి కేవలం వారం రోజుల్లోనే రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందిస్తోంది.

ఈ పథకాలు ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా అమలు జరగడం లేదు. ఈ పథకాలపై కేంద్రం కూడా పలుమార్లు ప్రశంసలను కూడా కురిపించిన విషయం తెలిసిందే. ఇక గ్రా మాలు, పట్టణాలను ఒక క్రమ పద్దతిలో అభివృద్ధి పరచేందుకు సిఎం కెసిఆర్ తీసుకొచ్చిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలను సాధిస్తున్నాయి. ముఖ్యంగా గ్రామాలు అయితే పచ్చదనంతో మెరిసిపోతున్నాయి. పరిశుభ్రంతో కళకళలాడుతున్నాయి. ఇక హరితహారం కార్యక్రమం కింద పెద్దఎత్తున నాటుతున్న మొ క్కలతో రాష్ట్రం మొత్తం హరితవనంతో తరిస్తోంది. గత రాష్ట్రంలో భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు గత సంవత్సరం అక్టోబర్ 29వ తేదిన సిఎం కెసిఆర్ ధరణి పోర్టల్‌ను మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో ప్రారంభించారు. దీని కింద రాష్ట్రంలో ఇప్పటి వర కు 90 శాతం వరకు భూరికార్డుల ప్రక్షాళన జరిగింది. అలాగే పారిశ్రామిక రంగంలోనూ గణనీయమైన వృద్ధిని సాధించడమే కాకుండా కోట్లాది రూపాయల పెట్టుబడును సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.

ఆర్ధిక ప్రగతి పైపైకి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కేవలం 5 లక్షల ఉన్న జిఎస్‌డిపి 2020…2021 నాటికి 9.80 లక్షల కోట్లకు చేరింది. ప్రధానంగా గడిచిన మూడు సంవత్సరాల్లో ఆర్ధిక ప్రగతి గణనీయంగా పెరిగింది. 20182-019లో 8.60 లక్షల 20192020 లో 9.57 లక్షల కోట్లకు చేరింది. అలాగే జిడిపి కూడా 2018..2019లో 1,88,86,957 కోట్ల నుంచి 1,97,45,670 కోట్లకు పెరిగింది. మొత్తంగా దేశ జిడిపిలో తెలంగాణ రాష్ట్రం నాలుగు శాతం నుంచి 4.97 శాతానికి పెరిగింది.

అనేక అవార్డులు…

ఇటీవల రాష్ట్రానికి 12 ’స్వచ్ఛ సర్వేక్షణ్’ మరో 12 జాతీయ పంచాయతీ అవార్డులు లభించాయి. కాగా ’బెస్ట్ పెర్ఫార్మింగ్ ఐటి మినిస్టర్’ గా 2020 సంవత్సరం అవార్డుకు మంత్రి కెటిఆర్‌కు లభించింది.దేశంలో ’అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఐటి మంత్రిగా ఆయనకు ఈ అవార్డు దక్కింది.కమ్యూనికేషన్స్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ – కోవిడ్ 19 కింద పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా జాతీయ అవార్డు రాష్ట్ర డిజిటల్ మీడియా వింగ్ దక్కించుకుంది. రాష్ట్ర స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీకి అగ్రికల్చర్ టుడే గ్రూప్ ద్వారా దేశంలోనే అత్యుత్తమ విత్తన ధృవీకరణ అథారిటీగా ఇండియా సీడ్ అవార్డు లభించింది. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హడ్కో) అవార్డును కొల్లూరు ప్రాజెక్ట్ కైవసం చేసుకోవడంతో తెలంగాణ ప్రభుత్వ డబుల్ బెడ్‌రూమ్ హౌసింగ్ ప్రాజెక్ట్ మరో జాతీయ స్థాయికి చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) కొల్లూరులో రూ.1,408 కోట్లతో 15,660 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించే భారీ ప్రాజెక్టును చేపడుతోంది.

ఈ ప్రాజెక్ట్ హౌసింగ్, అర్బన్ పావర్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ థీమ్ కింద బెస్ట్ ప్రాక్టీసెస్ 2019…-20 కోసం హడ్కో అవార్డును అందుకుంది. కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్ర పోలీసులు చేసిన కృషికి స్కోచ్ గోల్ అవార్డు లభించింది. రాష్ట్రంలో చిట్ ఫండ్‌ల నిర్వహణ కోసం తెలంగాణ బ్లాక్‌చెయిన్ ప్రాజెక్ట్ అయిన టి-చిట్స్, ’ఎక్స్‌లెన్స్ ఇన్ అడాప్టింగ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్’ విభాగంలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇ…-గవర్నెన్స్ కింద గోల్డ్ అవార్డును గెలుచుకుంది. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్ కాన్‌క్లేవ్‌లో 2019కి గానూ రాష్ట్రానికి అవార్డు లభించింది.

’ఐ ఎక్స్‌ప్లోర్ తెలంగాణ’ అనే మొట్టమొదటి మొబైల్ యాప్ కోసం తెలంగాణ ప్రభుత్వం ’మోస్ట్ ఇన్నోవేటివ్ యూజ్ ఆఫ్ ఐటి అండ్ సోషల్ మీడియా మొబైల్ యాప్‌వెబ్‌సైట్ కేటగిరీ కింద జాతీయ పర్యాటక అవార్డును అందుకుంది. ఈ యాప్ తెలంగాణ పర్యాటక ప్రాంతాలతోపాటు ఇతర సేవలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ 2018 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన ’సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్’ అవార్డు లభించింది. నదుల పునరుజ్జీవనం, నీటి వనరులను పరిరక్షించడం కోసం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేసినందుకు ఈ అవార్డు వచ్చింది. ఇలా మూడేళ్లలో రాష్ట్రానికి అనేక అవార్డులు లభించాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News