Monday, April 29, 2024

రాజీనామా

- Advertisement -
- Advertisement -

టిఎస్‌పిఎస్‌సి చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన  జనార్ధన్‌ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవికి జనార్ధన్‌రెడ్డి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌కు పంపారు. రాజీనామాకు ముందు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. 2021లో అప్పటి ప్రభుత్వం టిఎస్‌పిఎస్‌సి చైర్మన్‌గా జనార్ధన్‌రెడ్డిని నియమించింది. జనార్ధన్‌రెడ్డి ఐఎఎస్ అధికారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలో పలు కీలక పోస్టుల్లో విధులు నిర్వహించారు. 1990లో గ్రూప్ -1కు ఎంపికైన ఆయన డిప్యూటీ కలెక్టర్ బాధ్యతలు నిర్వహించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నల్లగొండ, నెల్లూరు ఆర్‌డిఒగా సేవలందించారు. ఆయన స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం పెద్దాయపల్లి. ఆయన అగ్రికల్చర్ పిజి చేశారు. వరంగల్, అనంతపురం జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, మార్కెటింగ్ శాఖల కమిషనర్‌గా, సహకారశాఖ రిజిస్ట్రార్‌గా, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ కమిషనర్‌గా, విద్యాశాఖ కార్యదర్శిగా, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా సేవలందించారు. 2021 మే నెలలో అప్పటి ప్రభుత్వం ఆయనను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News