Monday, April 29, 2024

జియో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ’నెక్స్ట్’ పొందడం ఎలా?

- Advertisement -
Jio next

- Advertisement -

ధర ఎంత? ఇఎంఐ ఉంటుందా?…

బెంగళూరు: ఎట్టకేలకు రిలయన్స్, గూగుల్ సంయుక్తంగా కలిసి జియో ఫోన్ నెక్స్ట్ దేశీయ మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ దీపావళికి వినియోగదారుల చేతుల్లోకి రానున్నట్లు సమాచారం. డబ్బు మొత్తంగా చెల్లించేట్టయితే రూ. 6499 కట్టాలి. లేదంటే రూ. 1999 కట్టి మిగతాది నెలకు రూ. 300 చొప్పున కిస్తులు కట్టాల్సి ఉంటుంది(ప్లస్ ప్రాసెసింగ్ ఫీజు రూ. 501). జియో ఫోన్ నెక్ట్ ప్రగతి ఆపరేటింగ్ సిస్టంతో నడుస్తుంది. జియో ఫోన్ నెక్స్ట్ ఫోన్ కావాలనుకునేవారు తమకు దగ్గరలోని జియో మార్ట్ డిజిటల్ రిటైలర్ లేక వెబ్‌సైట్‌లోకి వెళ్ళి రిజిష్టరు చేసుకోవాల్సి ఉంటుంది. వాట్సాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అయితే వాట్సాప్ వినియోగదారుడు ‘హై’ అని 7018870182కు మెసేజ్ పంపి ప్రాసెస చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తి అయితే ధృవీకరణ మెసేజ్ కొనుగోలుదారుకు వస్తుంది. అప్పుడు వినియోగదారుడు దగ్గరలోని జియోమార్ట్ రిటైలర్ దగ్గరికి వెళ్లి జియోఫోన్ నెక్స్ట్ ను పొందవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News