Sunday, April 28, 2024

ఆరుగురు కశ్మీరు ప్రభుత్వ ఉద్యోగుల బర్తరఫ్

- Advertisement -
- Advertisement -

J&K govt sacks 6 employees over ‘terror links’

ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నట్లు నిర్ధారణ

శ్రీనగర్: ఉగ్రవాదులతో సంబంధాలతోపాటు వారికి అండగా నిలబడినందుకు ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లతోపాటు జమ్మూ కశ్మీరు ప్రభుత్వానికి చెందిన ఆరుగురు ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసు నుంచి బర్తరఫ్ చేసినట్లు బుధవారం అధికారులు తెలిపారు. జమ్మూ కశ్మీరు పాలనా యంత్రాంగానికి చెందిన అధికారిక కమిటీ ఈ ఆరుగురు ఉద్యోగుల బర్తరఫ్‌లకు ఆమోద ముద్ర వేసింది. ఈ ఆరుగురు ఉద్యోగులలో అబ్దుల్ హమీద్ వని అనే వ్యక్తి ప్రభుత్వ టీచరుగా పనిచేసేవారు. ప్రభుత్వ ఉద్యోగం చేపట్టక ముందు ఇతను ఒకప్పటి అల్లా టైగర్స్ అనే ఉగ్రవాద సంస్థకు జిల్లా కమాండర్‌గా పనిచేశాడని అధికారులు తెలిపారు. పోలీసు కానిస్టేబుల్ జాఫర్ హుస్సేన్ బట్, ఆర్ అండ్ బి శాఖలో జూనియర్ అసిస్టెంట్ మొహమ్మద్ రఫీ బట్, ప్రభుత్వ స్కూలు టీచరు లియాఖత్ లీ కక్రూ, అటవీ శాఖలో రేంజ్ అధికారి తారీఖ్ మహమూద్ కోహ్లికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై విధుల నుంచి తొలగించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News