Monday, April 29, 2024

పునీత్ పార్థివదేహాన్ని చూసి ఎన్టీఆర్ కన్నీటి పర్యంతం..

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌ను కడసారి చూసేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు అధిక సంఖ్యలో బెంగుళూర్‌లోని కంఠీరవ స్టేడియానికి వచ్చారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, ఎన్టీఆర్, రానా, ప్రభుదేవా, శ్రీకాంత్, పశాంత్‌నీల్, నరేశ్, శివబాలాజీ, అలీ తదితర సినీ ప్రముఖులు కంఠీరవ స్టేడియంలో ఉంచిన పునీత్ భౌతికకాయం వద్ద పుష్పగుచ్ఛాన్ని ఉంచి నివాళులర్పించారు. శివరాజ్‌కుమార్, అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. “పునీత్ రాజ్‌కుమార్ మృతిని జీర్ణించుకోలేకపోతున్నా. ఆయన అకాల మరణం నన్ను కలిచివేసింది. దేవుడు చాలా అన్యాయం చేశాడు. బెంగుళూరు వచ్చిన ప్రతిసారి పునీత్‌ను కలిసేవాడిని. అతని కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నా”అని అన్నారు.

ఇక పునీత్‌కు మంచి స్నేహితుడైన ఎన్టీఆర్ అతని పార్థివదేహాన్ని చూస్తూ భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం తారక్‌ని చూసిన పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. తారక్ ఆయనను ఆలింగనం చేసుకుని ఓదార్చారు. ఇక పునీత్ రాజ్‌కుమార్ మరణంతో నందమూరి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురైన ఆయన కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం పునీత్ సోదరుడు శివరాజ్‌కుమార్‌ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. “పునీత్ మన మధ్య లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన మరణం వ్యక్తిగతంగా నాకు తీరనిలోటు. రాజ్‌కుమార్ కుటుంబంతో మాకెంతో అనుబంధం ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతా అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉండేవాళ్లం. ఒక కళాకారుడిగా ప్రేక్షకుల్ని అలరిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ మరణం చూస్తే.. దేవుడు ఎంతో అన్యాయం చేశాడనిపిస్తోంది. నేను నటించిన ‘ఎన్టీఆర్’ సినిమా ప్రమోషన్‌కి కూడా పునీత్ వచ్చాడు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

Jr NTR Pay last respects to Puneeth Rajkumar

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News