Monday, April 29, 2024

బెయిల్ జారీ జాప్యం ఘోర తప్పిదం

- Advertisement -
- Advertisement -
Justice Chandrachud rues delay in bail releases
ఖైదీల స్వేచ్ఛ హక్కుల హరణమే :జస్టిస్

న్యూఢిల్లీ : జైలు అధికారులకు బెయిల్ ఆదేశాలజారీలో జాప్యం తీవ్రమైన తప్పిదం అవుతుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి డివై చంద్రచూడ్ తెలిపారు. ఏదైనా కేసుకు సంబంధించి నిందితుల బెయిల్ ఆదేశాలు సకాలంలో జైలు అధికారులకు అందాల్సి ఉంటుంది. ఇందులో జరిగే జాప్యం విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ఈ సమస్య పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవల్సి ఉంటుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఈ అంశానికి విచారణలో ఖైదీల మానవీయ స్వేచ్ఛ హక్కుకు సంబంధం ఉందనే విషయాన్ని గుర్తించాల్సి ఉందని తెలిపారు. కక్షిదారులకు న్యాయసాయం దిశలో అలహాబాద్ హైకోర్టు ద్వారా వర్చువల్ కోర్టులు, ఈ సేవా కేంద్రాల ప్రారంభ నేపథ్యంలో జరిగిన ఆన్‌లైన్ కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడారు. బెయిల్ జారీల జాప్యం దేశంలోని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో నెలకొని ఉన్న లోపభూయిష్ట పరిణామం అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు తరువాత ఆదేశాల జారీ ప్రక్రియలో ఆలస్యంతో ఆయన ఒక్కరోజు అదనంగా అర్థూర్ రోడ్ జైలులో గడపాల్సి వచ్చింది. దీనిపై సంబంధిత కేసు లాయర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఉదంతం, ఇతరత్రా కేసులలో బెయిల్ జారీల ఆలస్యం నేపథ్యంలో న్యాయమూర్తి వ్యాఖ్యానాలు వెలువడ్డాయి. ఇంతకు ముందు ఈ అంశంపైనే ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ సారథ్యపు ధర్మాసనం ఓ కేసుకు సంబంధించి ఘాటుగా స్పందించింది. బెయిల్ సకాలపు అమలు ప్రక్రియలో జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. దీనిని తాము పరిగణనలోకి తీసుకుని భద్రతాయుత, విశ్వసనీయ, అధికారిక విభాగాన్ని ఏర్పాటు చేస్తామని, త్వరితగతిన బెయిల్ ఆదేశాల ప్రతి అందేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News