Saturday, May 11, 2024

కాళోజీ జీవితం అందరికీ ఆదర్శం: మహమూద్ అలీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాళోజీ జీవితం అందరికీ ఆదర్శంగా ఉందని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రవీంద్రభారతిలో ప్రజాకవి కాళోజీ నారాయణ రావు 107వ జయంతి ఉత్సవాలను మంత్రులు ఘనంగా ప్రారంభించారు. కాళోజీ పురస్కారాన్ని పెన్నా శివరామకృష్ణకు మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడారు. తన కలంతో ప్రజలను జాగృతం చేసిన వ్యక్తి కాళోజీ అని, కాళోజీ ప్రభావం ప్రతీ ఒక్కరిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంఎల్‌ఎ సాంస్కృతిక సారథి రసమయి బాలకిషన్, ఎంఎల్‌సి గోరేటి వెంకన్న పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News