Sunday, April 28, 2024

కామారెడ్డి డిఎస్‌పి సస్పెండ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మీనారాయణను గురువారం నాడు సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డిజిపి డాక్టర్ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. క్రికెట్ బెట్టింగ్ నిందితుల నుంచి లంచం డిమాండ్ చేసిన కేసులో సోదాలు నిర్వహించిన ఎసిబి అధికారులకు డిఎస్‌పి అక్రమాస్తులు బయటపడ్డాయి. డిఎస్‌పి లక్ష్మీనారయణకు వేర్వేరు ప్రాంతాలలో రూ.2 కోట్ల 12 లక్షల విలువైన ఆస్తులు ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు.

ఈక్రమంలో కామారెడ్డి డిఎస్‌పి లక్ష్మినారాయణ అక్రమాస్తులపై ఎసిబి అధికారులు విచారణ చేపడుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కేసులో ఐదుగురు నిందితులకు బెయిలు ఇచ్చేందుకు కామారెడ్డి ఇన్‌స్పెక్టర్ జగదీష్ నిందితుల నుంచి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేయడంతో పాటు నిందితులు ముందుగా లక్షాయాభై వేల రూపాయలు నగదు ఇస్తుండగా ఎసిబి అధికారులు దాడి చేసి పట్టుకు విషయం విదితమే, ఈ కేసులో లభ్యమైన నగదుపై కామారెడ్డి సిఐ, ఎస్‌ఐ, మధ్యవర్తిని ప్రశ్నించిన ఎసిబి అధికారులకు ఆ నగదు డిఎస్‌పి లక్ష్మినారాయణకు చెందినవిగా గుర్తించారు.

దీంతో ఎసిబి బృందం డిఎస్‌పి లక్ష్మినారాయణకు నిజామాబాద్, నల్గొండ కామారెడ్డి రంగారెడ్డి జిల్లాల్లో 17 వ్యవసాయ భూములు, 5 ఇళ్ల ఖాళీ స్థలాలు, తిరుమలగిరి, సరూర్‌నగర్, మిర్యాలగూడ ప్రాంతాల్లో భవనాలతోపాటు బంగారం, నగదును గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ మేరకు డిఎస్‌పి లక్ష్మినారాయణను ఎసిబి అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News