Monday, April 29, 2024

హోటల్ గదిలో ‘కాంచన 3’ నటి ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘కాంచన 3’లో నటించిన యువ నటి బలవర్మరణానికి పాల్పడిట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రాఘవ లారెన్స్ నటించి, తెరకెక్కించిన ఈ మూవీలో 24ఏళ్ల అలెగ్జాండ్రా జావి అనే రష్యన్ యువతి దెయ్యం పాత్రలో నటించింది. అయితే, సడెన్ గా జావి తన అద్దె ఇంట్లో ఆత్మహత్య చేసుకుందనే వార్తా అందరినీ షాక్ గురిచేసింది. వివరాల్లోకి వళితే.. ప్రస్తుతం గోవాలోని ఓ హోటల్ లో బస చేస్తున్న జావి ఉరి వేసుకుని మృతి చెందినట్లుగా తెలుస్తోంది. అయితే, కొద్దిరోజుల క్రితం తన ప్రియుడితో మనస్పర్థలు వచ్చి విడిపోయిన జావి.. అప్పటినుంచి డిప్రెషన్ లోకి వెళ్లిందని, ఈ క్రమంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గోవా పోలీసులు.. నటి జావి ఆత్మహత్య చేసుకుందా? లేక హత్యకు గురైందా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

Kanchana 3 Actress Dies by Suicide in Goa

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News