Sunday, April 28, 2024

వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ ని వదులుకుంటా

- Advertisement -
- Advertisement -

Kangana Ranaut offers to return Padma Shri

విమర్శలను కొట్టి పారేసిన కంగన

న్యూఢిల్లీ : భారత్‌కు నిజమైన స్వాతంత్య్రం 2014 లో వచ్చిందని, 1947 లో వచ్చింది కేవలం బిక్ష మాత్రమేనని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగుతోంది. స్వాతంత్య్ర యోధులను అవమానించిన కంగనను అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీతో సహా పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయినా ఆమె తన వ్యాఖ్యలను మరోసారి సమర్ధించుకున్నారు. అంతేకాక తాను చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపిస్తే ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేసానని ఇన్‌స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు. ఇందులో అనేక ప్రశ్నలు సంధించారు. రాణీ లక్ష్మీబాయి జీవిత చరిత్రపై తీసిన చిత్రంలో నేను నటించాను. దీని కోసం 1857 లో జరిగిన తొలి స్వాతంత్య పోరాటంపై పరిశోధన చేశాను . అప్పుడు జాతీయ వాదం పెరిగింది. కానీ ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయిందిఅని ప్రశ్నలు కురిపించారు.

ఆనాటి దేశ విభజనను ప్రస్తావిస్తూ మహాత్మా గాంధీ వైఖరి భగత్ సింగ్ మరణానికి, దేశ విభజనకు దారి తీసిందని ఆరోపించారు. దీన్ని సుభాస్ చంద్రబోస్ సమర్థించలేదని ఆమె వ్యాఖ్యానించారు. 1857 లో తొలి సారిగా స్వాతంత్య్రం కోసం ఉమ్మడి పోరాటంలో రాణి లక్ష్మీబాయి తదితరులు ప్రాణాలర్పించారని ఆమె చెప్పారు. అనంతం స్వాతంత్య్ర పోరాటంలో సుభాష్ చంద్ర బోస్ , వీర్‌సావర్కర్ వంటి స్వాతంత్య్ర యోధులు ఎన్నో త్యాగాలు చేశారని ఆమె పేర్కొన్నారు. బాలగంగాధర్ తిలక్, అరవింద ఘోష్, బిపిన్ చంద్రపాల్, తదితర స్వాతంత్రయోధుల చరిత్ర పుస్తకం లోని పేజీలను ఈ సందర్భంగా ఆమె షేర్ చేశారు. 1857 లో జరిగిన యుద్ధం గురించి నాకు తెలుసు. కానీ 1947 లో ఏం జరిగింది. దీని గురించి ఎవరైనా నాకు హితబోధ చేస్తే తప్పకుండా నా పద్మశ్రీ వెనక్కు ఇచ్చి అందరికీ క్షమాపణ చెబుతాను అని ఇన్‌స్టా్రగ్రామ్‌లో ఆమె రాసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News