Sunday, April 28, 2024

రైతుబంధుకు పరిమితి విధించాలని అంటున్నరు..

- Advertisement -
- Advertisement -

‘రైతులకు రైతుబంధు సైతం పదెకరాలకు మించి ఎందుకు ఇస్తున్నరు? లిమిట్‌ చేయచ్చుకదా అని తనను కూడా అడుగుతున్నరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. బుధవారం జగిత్యాలలో ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ను సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఎం మాట్లాడుతూ… ”రాష్ట్రంలో 93.50శాతం ఐదెకరాలలోపు రైతులే ఉన్నారు. ఐదు నుంచి పదెకరాలున్న ఉన్న రైతులు ఐదారు శాతం ఉన్నారు. మామిడి, వగైరా ఉన్న వారు ఒకశాతం మాత్రమే ఉన్నారు. 25 ఎకరాలుపైనున్న వారు పాయింట్‌ 28శాతం మంది ఉన్నారు. వరద కాలువకు తూము పెట్టాలంటే ఒక కథ. నీరు రావాలంటే ఒక కథ. భయంకరమైన పరిస్థితులుండేవి. ఎస్సారెస్పీ ఆయకట్టకు కింద ఉన్న ఆయకట్టులో నీళ్లు రాక పంటలు పండక ఇబ్బందులు పడ్డారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, నల్లగొండ, మెదక్‌ జిల్లాల్లో 30-40 ఎకరాలున్న రైతులు హైదరాబాద్‌, బొంబాయి, బొగ్గుబాయిలో పని చేసే పరిస్థితులు. చెల్లాచెదురై చెట్టుకొకరు.. గుట్టకొకరైన పరిస్థితి.

రైతు సైతం రేషన్‌కార్డు కోసం అడుక్కునే దుస్థితి. వ్యవసాయ స్థిరీకరణ, అగ్రికల్చర్‌ ప్రొడక్షన్‌ పెరగడం వల్ల శాంతి, సౌభాగ్యం పల్లెల్లో అద్భుతంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణ అద్భుతమైన గ్రామీణ ఆర్థిక పునాది పరిపుష్టమైంది. అనేక రంగాల్లో, అనేక విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. కమిట్‌మెంట్‌ ఉంటే తప్పా పనులు జరుగవు. సిద్ధిపేటగా ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇంద్రసేనారెడ్డి అనే పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఉండేవారు. ఆయన సలహాతో అద్భుతమైన పథకాన్ని ప్రారంభించాం. అదే స్ఫూర్తితో మిషన్‌ భగీరథ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేశాం. దాదాపు 40వేల ఓవర్‌హెడ్‌ ట్యాంకులున్నాయి. 17వేలకుపైగా ఉండగా.. కొత్తగా 20వేలకుపైగా నిర్మించాం’ అన్నారు. ప్రస్తుతం ఇంటింటికీ నీళ్లు అందుతున్నయ్‌. ఒక్క పథకం వెనుక ఎంత ఆలోచన ఉంటది? విజయవంతం కావాలని దీర్ఘదృష్టి ఉంటుంది.. ఆలోచిస్తే అర్థమవుతుంది’ అని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News