Monday, April 29, 2024

అంతర్ రాష్ట్ర జలాశయాల్లో చేపలవేటకు అండ

- Advertisement -
- Advertisement -

మత్సకారుల సమస్యలపై వారంరోజ్లులో నివేదిక
అధికారులకు మంత్రి తలసాని ఆదేశం

మనతెలంగాణ/హైదరాబాద్: అంతర్‌రాష్ట్ర జలాశయాల్లో చేపల వేటను సాగించే తెలంగాణ రాష్ట్రానికి చెందిన మత్సకారులకు ప్రభుత్వం అన్నివిధాల అండగా ఉంటుందని రాష్ట్ర పశుసంవర్ధక , మత్స పరిశ్రమ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. గురువారం మాసాబ్ ట్యాంక్‌లోని తన కార్యాయలంలో మంత్రి మత్సపరిశ్రమరంగపై ఆ శాఖ ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కృష్ణా, గోదావరి నదుల పరివాహంగా ఉన్న అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులకు చెందిన రిజర్వాయర్లలో చేపల వేటకు అర్హత కలిగిన తెలంగాణ రాష్ట్ర మత్సకారులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటూ ,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రతియేటా ఉచితంగా చేపపిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ , నాగార్జున సాగర్ రిజర్వాయర్, పులిచింతల ప్రాజెక్టు, నాగర్ కర్నూల్ జిల్లా పరధిలోని సోమశిల , తుంగభద్ర నదిపై ఉన్న సుంకేసుల ప్రాజెక్టు తదతర జలాశయాల్లో కోట్లాది చేపపిల్లలను విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ఇప్పటివరకూ తెలంగాణ ప్రభుత్వం ఉచిత చేపపిల్లల పంపిణీ కోసం రూ.7.12కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పెరిగిన చేపపిల్లలను పట్టుకునేందుకు లైసెన్స్ పొందిన 5800మంది మత్సకారులు ఉన్నారని , వారికి అవసరమైన అన్ని రకాల సహకారాలను ప్రభుత్వం అందచేస్తుందని తెలిపారు. అంతర్ రాష్ట్ర ప్రాజెక్టులలో చేపల వేటను కొనసాగించే మత్సకారులకు వలలు, మోపెడ్‌లు ,పవర్ బోట్‌లను అందచేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. వారంరోజుల్లోగా మత్సకారుల అవసరాలను తెలుసుకొని ఒక సమగ్ర నివేదికను అందజేయలని మంత్రి తలసాని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ మత్సకారులపై తరచుగా దాడులు జరగుతున్నాయని వస్తున్న ఫిర్యాదలపై వెంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు. అటు వంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించబోదన్నారు. దాడులకు పాల్పడే వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరింస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, మత్సశాఖ కమీషనర్ లచ్చిరాం భూక్యా, గద్వాల, వనపర్తి, నాగార్ కర్నూల్ ,నల్లగొండ , సూర్యాపేట జిల్లాలకు చెందిన మత్సయశాఖ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News