Sunday, April 28, 2024

30న కెసిఆర్ సినిమా…బ్లాక్‌బస్టర్

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ సినిమా డిజాస్టర్

కెసిఆర్ సెంచరీ కొట్టడం ఖాయం
వేములవాడ యువగర్జనలో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మన తెలంగాణ/వేములవాడ : నవంబర్ 30న సిఎం కెసిఆర్ సినిమా బ్లాక్‌బస్టర్ కొట్టబోతున్నారని ఎన్నికల్లో సెంచరీ కొట్ట డం ఖాయమని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం వే ములవాడ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన యువగర్జన సమావేశంలో ఆయన పాల్గొని ప్ర సంగించారు. ఎంఎల్‌ఎ అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపిస్తే, వే ములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని మంత్రి కేటిఆర్ హామీ ఇచ్చారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేవలం ఇద్దరి వ్యక్తుల మధ్య నో, లక్ష్మి నర్సింహారావు కొరకో జరుగుతున్న ఎన్నికలు కావని, ఉద్యమ నాయకుడు కేసిఆర్ కొరకు జరుగుతున్న ఎన్నికలు, రెండు పార్టీల మధ్యన జరుగుతున్న ఎన్నికలు అన్నారు. కాం గ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాం ధీలు వచ్చి తెలంగాణను ఆగం చేయాలని చూ స్తున్నారని అన్నారు. ఢిల్లీ దొరల తెలంగాణ కావాలో, 4.5 కోట్ల ప్రజల తెలంగాణ కావాలో ఆలోచించాలన్నారు.

కాంగ్రెస్ నాయకులు చేసిన అన్యాయాలకు వ్యతిరేకంగానే తెలంగాణ ఉ ద్యమం మొదలైందన్నారు. తెలంగాణ ఎవరో ఇచ్చింది కాదని, ఎంతోమంది ఉద్యమకారులు బలిదానాలు చేసుకుని, త్యాగాలు చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించింది తప్పితే తెలంగాణకు పూ ర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ భ విష్యత్‌కు భరోసా కల్పించే నాయకుడు సిఎం కెసిఆర్, అలాంటి నాయకుడు గెలిస్తేనే భవిష్య త్ తెలంగాణ గల్లీలలో ఉంటుందని లేదంటే ఢి ల్లీ దొరలకు గులాం అనాల్సిందేనని అన్నారు. లక్ష్మి నర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించాలని, ఇప్పటినుంచి వేములవాడకు ఇద్దరు ఎంఎల్‌ఎగా పనిచేస్తామన్నారు.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ కెటిఆర్ : ఎంఎల్‌ఎ అభ్యర్థి చల్మెడ
యువ నాయకుడు కెటిఆర్ కేవలం వ్యక్తి కాదని, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ అని ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మినర్సింహరావు అన్నారు. యువకుల భవిష్యత్ బాగుండాలని, ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకువచ్చి నేడు ఐ.టికి కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ ను మార్చిన ఘనత కేటిఆర్‌కే దక్కుతుందన్నారు. కెటిఆర్ వంటి నాయకుడు తమ దగ్గర లేడని చాలా దేశాల ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్‌లో 11 మంది ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ మాకు ఒకే ఒక నాయకుడు సియం కెసిఆర్ అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యాక్షుడు బోయినిపల్లి వినోద్ కుమార్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్, మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, విద్యార్థి జెఏసి నాయకులు మందాల భాస్కర్, దరువు ఎల్లన్న, జెడ్పి చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి రాజు, సీనియర్ నాయకులు మనోహర్ రెడ్డి, నాయకులు వెంగళ శ్రీకాంత్ గౌడ్, ఈర్లపల్లి రాజుతో పాటు ఆయా మండలాల యువజన విద్యార్థి విభాగం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో పాటు సుమారు 20వేల మంది విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News