Friday, May 17, 2024

ఖర్గేను హతమార్చేందుకు బిజెపి కుట్ర: కాంగ్రెస్

- Advertisement -
- Advertisement -
తన వాదనకు దన్నుగా ఆడియో క్లిప్ ప్రదర్శన

బెంగళూరు: భారతీయ జనతా పార్టీ తమ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబాన్ని చంపేందుకు కుటిల పన్నాగం పన్నుతోందని కాంగ్రెస్ శనివారం ఆరోపించింది. ఈ రోజు బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో చిత్తాపూర్ బిజెపి అభ్యర్థి మణికాంత్ రాథోడ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికారున్ ఖర్గేను కించపరిచే పదజాలం ఉపయోగించారని పేర్కొంటూ ఆడియో క్లిప్‌ను ప్లే చేశారు. అందులో ఆయనను, ఆయన కుటుంబాన్ని ఏరేస్తాం అంటూ మాట్లాడ్డం వినవచ్చు.

‘మల్లికార్జున్ ఖర్గే, ఆయన కుటుంబ సభ్యులను హత్య చేయడానికి బిజెపి నాయకులు ఇప్పుడు కుట్రపన్నుతున్నారు. చిట్టాపూర్ బిజెపి అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి బొమ్మై ప్రేరేపిత వ్యక్తి(బ్లూ-ఐడ్ బాయ్) అని రికార్డింగ్‌ను బట్టి స్పష్టమవుతోంది’ అని రణదీప్ సూర్జేవాలా అన్నారు. ‘ప్రధానమంత్రి మౌనంగా ఉంటారని నాకు తెలుసు. అలాగే కర్నాటక పోలీసులు, భారత ఎన్నికల సంఘం కూడా మౌనంగా ఉంటారని నాకు తెలుసు. అయితే కర్నాటక ప్రజలు మౌనంగా ఉండబోరని, తగిన సమాధానం చెబుతారు’ అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పత్రికా విలేకుల సమావేశంలో పవన్ ఖేరా కూడా పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రకటన ప్రకారం, ‘కన్నడిగుల పట్ల బిజెపికి ఉన్న ద్వేషం కర్నాటక భూమి పుత్రుడు ఖర్గేను చంపడానికి ‘హత్య కుట్ర’గా వ్యక్తమవుతోంది’ అన్నారు.

చిత్తాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మణికాంత్ రాథోడ్, కాంగ్రెస్ అభ్యర్థి అయిన ప్రియాంక్ ఖర్గేని హత్య చేస్తామని బెదిరించినందుకు 2022 నవంబర్ 13 అరెస్టయ్యారు. తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యారు. అప్పట్లో ఓ మీడియా సమావేశంలో ప్రియాంక్ ఖర్గేను కాల్చి చంపేందుకు సిద్ధమని బహిరంగంగానే వెల్లడించారు.

మే 2న, బిజెపి ఎంఎల్‌ఎ, జనరల్ సెక్రటరీ మదన్ దిలావర్, ‘మల్లికార్జున్ ఖర్గేకి ‘మరణ’ శుభాకాంక్షలు తెలిపారు. ‘కాంగ్రెస్ అధ్యక్షుడికి 80 సంవత్సరాలు; దేవుడు ఆయన్ని ఎప్పుడైనా తీసుకెళ్లగలడు’ అన్నారు. ‘ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే, ఆయన భార్య, మొత్తం కుటుంబాన్ని హత్యచేసేందుకు బిజెపి నేతలు కుట్ర పన్నుతున్నారు’ అని కాంగ్రెస్ పార్టీ తన ప్రకటనలో ఆరోపించింది. నిరాశ, నిస్పృహ కారణంగా ఇప్పుడు బిజెపి, దాని నాయకత్వం ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు కాంగ్రెస్ ఆరోపించింది. ఇన్నాళ్లు 40 శాతం అవినీతితో కర్నాటకలో నెట్టుకొచ్చిన బిజెపి చివరికి హత్య కుట్రలకు కూడా తెగబడుతున్నారని కాంగ్రెస్ పేర్కొంది. ‘ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కర్నాటక పోలీస్, ఎన్నికల సంఘం కుట్రపై మౌనంగా ఉన్నారు’ అని కాంగ్రెస్ తన ప్రకటనలో పేర్కొంది. 6.5 కోట్ల కన్నడ ప్రజలు వారి కుట్రలకు తగు విధంగా జవాబిస్తారని కూడా కాంగ్రెస్ తన ప్రకటనలో అభిప్రాయపడింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News