Monday, April 29, 2024

11మంది రైతుల వారసులకు ఉద్యోగాలిచ్చిన పంజాబ్ ప్రభుత్వం

- Advertisement -
- Advertisement -

Kin of 11 Farmers who died during protests given Jobs by Punjab govt

చండీగఢ్: ఆందోళన సమయంలో మృతిచెందిన 11మంది రైతుల వారసులకు పంజాబ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌సింగ్‌చన్నీ, వ్యవసాయమంత్రి రణదీప్‌సింగ్‌లు వారికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. శనివారం దీనిపై ఆ రాష్ట్ర అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. క్లర్క్ ఉద్యోగాలను కల్పించినట్టు తెలిపారు. బాధిత రైతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయమందిస్తుందని చన్నీ తెలిపారు. తమ రాష్ట్రంలో మృతి చెందిన రైతుల కుటుంబాకు రూ.5 లక్షల సహాయం, ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని పంజాబ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇప్పటికే 157మంది రైతుల వారసులకు ఉద్యోగాలు కల్పించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News