Sunday, April 28, 2024

కైటెక్స్‌తో ఎంఒయు

- Advertisement -
- Advertisement -

Kitex Company MoU with Telangana govt

వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో
రూ.2400 కోట్ల పెట్టుబడితో
అపెరల్ కంపెనీలు పెట్టనున్న
కైటెక్స్ ప్రపంచంలోనే రెండవ
అతిపెద్ద కిడ్స్ అపెరల్
మాన్యుఫాక్చరింగ్ గ్రూప్ 22వేల
మందికి ప్రత్యక్షంగా, 18వేల
మందికి పరోక్షంగా ఉపాధి
రాష్ట్రంలోని 3లక్షల ఎకరాల్లోని
పత్తిని కొనుగోలు చేసే అవకాశం
మహిళలకు పెరగనున్న ఉపాధి
అవకాశాలు మంత్రులు కెటిఆర్,
ఎర్రబెల్లి, సబిత ఇంద్రారెడ్డి
సమక్షంలో కుదిరిన ఎంఒయు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి బడా కంపెనీలు క్యూకడుతున్నాయి. పెట్టుబడుల వెల్లువ ప్రవాహం వరదలా కొనసాగుతోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమను నెలకొల్పేందుకు కైటెక్స్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రముఖ దుస్తుల తయారీలో పేరున్న ఈ సంస్థ రాష్ట్రంలో రూ. 2400 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చోట్ల నెలకొల్పనున్న నూతన ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా 18 వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు కైటెక్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు హోటల్లో రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర విద్యా శాఖ మం త్రి సబితా ఇంద్రారెడ్డిల సమక్షంలో కైటె క్స్ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెట్టుబడులకు ముం దుకొచ్చిన కైటెక్స్ గ్రూపుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో రూ. 2400 కోట్ల పెట్టుబడి పెట్టాలని సదరు కంపెనీ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఒక్క ఫోన్ కాల్‌తో ప్రారంభమైన పెట్టుబడి చర్చలు, ఈరోజు భారీ పెట్టుబడి, ఉపాధి కల్పన రూపం దాల్చాయని కెటిఆర్ వ్యాఖ్యానించారు.

కేరళలో ప్రైవేట్ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తూ, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కిడ్స్ అప్పరల్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీగా ఉన్న కైటెక్స్ గ్రూపును రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. వరంగల్, రంగారెడ్డిలో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందిస్తామన్నారు. ఈ పెట్టుబడులతో రాష్ట్రంలో 22వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన, మరో 18వేల మందికిపైగా పరోక్ష ఉపాధి లభించనున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. ఈ కంపెనీల స్థాపన పూర్తయిన తర్వాత సుమారు మూడు లక్షల ఎకరాల్లోని తెలంగాణ పత్తిని కంపెనీ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. కంపెనీ ఉద్యోగాల కల్పనలో స్థానికులకు అధికంగా అవకాశాలు వచ్చేలా, వారికి అవసరమైన శిక్షణ కార్యకలాపాలను ప్రభుత్వం తరఫున చేపడతామని చెప్పారు. అందుకని స్థానిక మహిళా సంఘాలతో సమన్వయం చేసుకోవాలని జిల్లా ప్రజాప్రతినిధులకు కెటిఆర్ సూచించారు.

సిఎస్‌ఆర్ కింద రూ.6 కోట్ల విలువ చేసే పిపిఇ కిట్లు కైటెక్స్ ఇవ్వనుందన్నారు. రాష్ట్రంలోని మూడు లక్షల ఎకరాల్లో పండించిన అత్యంత నాణ్యమైన పత్తిని దశలవారిగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కైటెక్స్ యాజమాన్యం చెబుతోందన్నారు. దీని వల్ల పతి ్తరైతులకు లాభం చేకూరుతుందన్నారు. మహిళలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కనీసం 85 నుంచి 90 శాతం మహిళలకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే రాష్ట్రానికి పన్నుల రూపంలో పెద్దమొత్తంలో ఆదాయం కూడా చేకూరుతుందన్నారు. ఇది ఒక విధంగా బహుళార్ధక ప్రాజెక్ట్ అవుతుందని మంత్రి కెటిఆర్ వ్యాఖ్యానిచారు. ఈ నేపథ్యంలో కైటెక్స్ సంస్థకు అన్ని రకాలుగా సంపూర్ణ సహకారాలు అందిస్తామన్నారు. సీతారాంపూర్లో ఉన్న స్థానిక మహిళాసంఘాలతో సమావేశాలు పెట్టి ఇప్పటి నుంచి శిక్షణ ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, స్థానిక శాసనసభ్యుడు యాదయ్యను కోరుతున్నట్లు పేర్కొన్నారు.

కెటిఆర్ చొరవతోనే పెట్టుబడులు

కేరళ నుంచి తమ పెట్టుబడులు ఉపసంహరించుకున్న తర్వాత తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు రావడానికి ప్రధాన కారణం మంత్రి కెటిఆర్ అని కైటెక్స్ కంపెనీ ఎండి సాబు జాకబ్ ప్రకటించారు. రాష్ట్రంలో పరిశ్రమల అనుకూల వాతావరణం, విధానాలు బాగా నచ్చాయన్నారు. ఇక్కడి పరిస్థితులపై సంపూర్ణంగా అధ్యయనం చేసిన తర్వాత తమ పెట్టుబడులను రూ. 1000 కోట్ల నుంచి రూ. 2400 కోట్లకు పెంచుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్స్ పార్కుతో పాటు, రంగారెడ్డి జిల్లాలోని సీతారాంపురంలో ఇంటిగ్రేటెడ్ ఫైబర్ టు అప్పరల్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ముందుగా కెటిఆర్‌ను కలిసినప్పుడు మీకు పెట్టుబడి కావాలా? ఉద్యోగావకాశాలు కావాలా? అని అడిగితే క్షణం ఆలస్యం చేయకుండా ఉద్యోగ అవకాశాలే కావాలని చెప్పారన్నారు.

రాష్ట్రంలోని యువత పట్ల కెటిఆర్‌కున్న నిబద్దత… తనను అమితంగా ఆకట్టుకుందని సాబుజాకబ్ అన్నారు. తమ ప్లాంట్ల ద్వారా భవిష్యత్తులో తెలంగాణ భూభాగం నుంచి మూడు మిలియన్ల వస్త్రాలను అమెరికాకి ఎగుమతి చేస్తామన్నారు. తద్వారా భవిష్యత్తులో తెలంగాణ వస్త్రాలు ధరించని అమెరికా పిల్లలు ఉండరేమో అని అన్నారు. అన్ని కార్మిక సంక్షేమ వసతులతో ఈ ప్లాంట్లు నెలకొల్పుతామన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద తమ కంపెనీ తరపున ఆరు కోట్ల విలువ చేసే లక్షన్నర పిపిఇ కిట్లను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వచ్చే నవంబర్ నుంచి తమ ఉత్పత్తులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.

వరంగల్ జిల్లా గీసుకొండ-సంగెం శివారు మరియు రంగారెడ్డి సీతారాంపూర్ లలో దుస్తులు తయారీ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయడానికి కైటెక్స్ కంపెనీ ముందుకు రావడం పట్ల మంత్రి ఎర్రబెల్లి సంతోషం వ్యక్తం చేశారు. ఇందుకు సదకు కంపెనీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ పరిపాలనతో దేశంలో తెలంగాణకు మంచి పేరు వచ్చిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News