Monday, April 29, 2024

రేపు కృష్ణాబోర్డు భేటీ

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ జలాల పంపిణీ అంశం తెలుగు రాష్ట్రాల మధ్య సలసల కాగుతోంది. ఈ నదిపై ఉన్న ప్రాజెక్టుల నిర్వహణలో చి క్కుముడులు విప్పటంపై కేంద్రం వ్యవహారశైలి మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. తెలంగాణ, ఆం ధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్యన నీటివాటాలు తేల్చకుం డా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులను కృష్ణానదీయాజమాన్యబోర్డుకు అప్పగించాలంటూ చేస్తున్న తొందర పాటు చర్యలు బెడిసి కొడుతున్నాయి. ప్రాజెక్టులపై ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయంలోనే ఏళ్లు గడిచిపోతున్నాయి. ఇప్పటికీ ఈ విషయంలో కేం ద్ర జల్‌శక్తి శాఖ ఇరు రాష్ట్రాలకు ఆమోదయోగ్యమైన ప్రతిపాదన ఏది చూపలేకపోతోంది. తాజా గా కృష్ణనదీయాజమాన్యబోర్డు ఫిబ్రవరి ఒకటిన కీలక సమావేశం నిర్వహించేందకు నిర్ణయించింది.

గురువారం ఉదయం జలసౌధలో బోర్డు చైర్మన్ చాంబర్‌లో జరిగే ఈ సమావేశానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖల కు చెందిన ఇంజనీర్ ఇన్ చీఫ్‌లు హాజరు కావాలని కోరుతూ రెండు రాష్ట్రాలకు నోటీసులు పం పింది. ఈ సమావేశంలో చర్చించి నిర్ణయించాల్సి న అంశాలను కూడా నోటీసులో తెలియపరిచింది. కృష్ణానదీపైన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం , నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ అంశాలనే ప్రధానంగా పొందుపరిచింది. రెండు రాష్ట్రాల పరిధిలోని కృష్ణానదీజలాల విడుదలకు సబంధించిని 15 ఔట్‌లెట్లను బోర్డుకు అప్పగించే అంశాన్ని తొలి ప్రాధాన్యత అంశంగా చేర్చింది. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోకి వచ్చేవి ఏడు ఔట్‌లెట్లు ఉండగా, నాగార్జున సాగర్ ప్రాజెక్టు పరిధిలో ఎనిమిది ఔట్‌లెట్లు ఉన్నాయి.

ఈ ఔట్‌లెట్ల నిర్వహణకోసం వీటిని కృష్ణానదీయాజమాన్య బోర్డుకు అప్పగించాలని రెండు రాష్ట్రాలకు సూచించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఇ ప్పటికే సెంట్రల్ రిజర్వ్‌డ్ ఫోర్స్ పర్యవేక్షణలోకి చేరిపోయింది. ఈ ప్రాజెక్టుపైకి ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటిపారుదల శాఖ అ ధికారులు వెళ్లాలంటే ముందుగా కృష్ణాబోర్డు అనుమతి తీసుకోవాలని తెలిపింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు రిపేర్లకు సంబంధించి కూడా తెలంగాణ పరిధిలోకి వచ్చే ప్రాంతం తెలంగాణ ప్రభుత్వం ద్వారా , ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి వచ్చే ప్రాంతం ఎపి ప్రభుత్వం ద్వారానే బోర్డు పర్యవేక్షణలో రిపేర్లు చేపట్టాలని ప్రతిపాదించింది. అంతే కాకుండా ప్రాజెక్టు రిపేర్లు చేపట్టాలంటే మందుగా బోర్డకు లేఖ ద్వారా తెలియపరిచి రిపేర్ల ఆవశ్యతకను విన్నవించి బోర్డు చైర్మన్ అనుమతి మేరకే రిపేర్లు చేపట్టాలని సూచించింది. కృష్ణానదీజలాల పంపిణీ , నిర్వహణ తదితర అంశాల పర్యవేక్షణకోసం, తెలుగు రాష్ట్రాల కోసమే కేంద్ర ప్రభుత్వం నియమించిన కృష్ణానదీయాజమాన్యబోర్డు నిర్వహణకు అసరమైన నిధులు తెలంగాణ , ఆంధప్రదేశ్ ప్రభుత్వాలు సమకూర్చాలని తెలిపింది. ఈ నిధులను తక్షణమే రెండు రాష్ట్రాలు బోర్డుకు సమకూర్చాలని సూచించింది. ఈ అంశాలన్నిటిని ఫిబ్రవరి ఒకటిన జరిగే బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. రెండు రా్రష్ట్రాల ఈఎన్సీలు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఈ మేరకు కృష్ణాబోర్డు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను నోటీసులు పంపింది.
నీటివాటాలు తేల్చాకే ప్రాజెక్టుల అప్పగింత
కృష్ణానదీజలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా ఎంత అన్నది తేల్చాకే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే విషయం ఆలోచించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉంది. అంతే కాకుండా ఆపరేషన్ ప్రోటోకాల్‌కూడా ఆమోదయోగ్యమైన రీతిలో ఉండాలని కోరుకుంటోంది. 1976 మే 31న జస్టిస్ బచావత్ ట్రిబ్యునల్ కృష్ణానదీలో 75శాతం నీటి లభ్యత ఆధారంగా చేసుకుని ఉమ్మడి ఆంధప్రదేశ్‌కు 811టీఎంసీల నీటికి కేటాయించింది. అయితే ఆ తర్వాత వచ్చిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నదిలో 65శాతం నీటిలభ్యత ఆధారంగా చేసుకుని అదనంగా ఉమ్మడి ఏపికి 194టిఎంసీల నీటిని కేటాయిచింది. ఈ రెండు ట్రిబ్యునళ్ల తీర్పుల నాటికి తెలంగాణ రాష్ట్రం ఉనికిలో లేదు. ట్రిబ్యునల్ తీర్పుల సందర్బంగా అప్పటి ఉమ్మడి ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని, ఉనికిలో లేకుండా చేసిందని , ఈ ప్రాంత తాగు, సాగునీటి అవసరాలను పట్టించుకోలేదని తెలంగాణ ప్రాంత ప్రజల్లో ఏళ్లతరబడి అసంతృప్తి గూడుకట్టుకుంటూ వచ్చింది. తెలంగాణ ప్రత్యేకరాష్ట్ర ఉధ్యమం కూడా నీళ్లు నిధులు , నియామకాల మీదనే సాగిందని గుర్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2015జులై 18న జరిగిన సమావేశంలో కేంద్ర జల్‌శక్తిశాఖ తెలంగాణ ,ఏపికి కృష్ణానదీజలాల్లో నీటికేటాయింపులను తాత్కాలిక సర్దుబాటు చేసింది. 811టిఎంసీలలో తెలంగాణకు 299టిఎంసీలు, ఏపికి 512టిఎంసీలు కేటాయించింది. అయితే ఈ ఒప్పదం ఒక్క ఏడాదికి మాత్రమే అని తెలంగాణ గట్టిగా వాదిస్తోంది.
500టిఎంసీలు ఇవ్వాల్సిందే!
దశాబ్దాల తరబడి నదీజలాల్లో అన్యాయానికి గురైన తెలంగాణకు ఇకనైనా కృష్ణనీటిలో 500టిఎంసీలు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటా బయటా పోరాడుతోంది. ఇప్పటికే ఈ అంశంలో న్యాయపోరాటం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు లేఖల ద్వారా విజ్ణప్తి చేస్తూ వస్తోంది. అంతే కాకుండా కృష్ణాబేసిన్ పరిధిలోని ప్రాంతానికి , అక్కడి ప్రాజెక్టులకు కృష్టానదీజలాలను తరలించుకుపోకుడా ఏపిని కట్టడి చేయాలని కృష్ణాబోర్డుకు వందల సంఖ్యలో లేఖల ద్వారా విజ్ణప్తి చేసినట్టు తెలంగాణ ప్రభుత్వ నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో కూడా శ్రీశైలం , నాగార్జునసాగర్ ప్రాజెక్టులను, వాటి ఔట్‌లెట్లను అప్పగిస్తామని ఎటువంటి హామీలు ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News