Monday, April 29, 2024

ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మనదే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐటి రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థకు మంత్రి కెటిఆర్ భూమి పూజా చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.1655 కోట్ల పెట్టుబడితో ఫాక్స్‌కాన్ సంస్థ ఏర్పాటు అవుతుందన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా 35 వేల మంది ఉపాధి కలుగుతుందని చెప్పారు. ఫాక్స్‌కాన్ మరో 10 ఏళ్లలో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఫాక్స్‌కాన్‌కు 196 ఎకరాల భూమి కేటాయించిందని వివరించారు. ఫాక్స్‌కాన్‌కు భూమి పూజ చేయడం సంతోషకరమైన విషయమన్నారు.

Also Read: నిప్పుల వాన

ఒప్పందం కుదిరిన రెండున్నర నెలల్లోనే శంకుస్థాపన చేశామని పేర్కొన్నారు. మొదటి దశలో 25 వేల ఉద్యోగాలు, యువత కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇది తెలంగాణకు చిరకాలం గుర్తుంచుకునే రోజు అని కెటిఆర్ వివరించారు. ఫాక్స్‌కాన్ సంస్థకు అన్ని రకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణ ప్రగతి పథంలో పరుగులు పెడుతోందని, ఐటి రంగంలో దేశంలోని ప్రతి మూడు ఉద్యోగాల్లో ఒక ఉద్యోగం మనదేనని స్పష్టం చేశారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్ ఏడాదిలోగా పూర్తి కావాలని కోరుకుంటున్నామన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణకు ఐకాన్‌గా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంఎల్‌ఎ మంచి రెడ్డి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News