Sunday, April 28, 2024

థర్డ్‌వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం

- Advertisement -
- Advertisement -

 వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చాం
 త్వరలో మరో 7 వైద్య కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నాం : మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా మూడోవేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. నారాయణపేట జిల్లా కేంద్ర దవాఖానలో కొత్తగా నెలకొల్పిన 10 బెడ్‌ల ఐసియూ క్రిటికల్ వార్డును మంత్రి కెటిఆర్ శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యం ఇచ్చామని ఆయన తెలిపారు. గడిచిన ఏడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 1,600 ఐసియూ పడకలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఇప్పటికే 5 వైద్యకళాశాలను ఏర్పాటు చేశామని, త్వరలో మరో 7 కళాశాలలను ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో 600 పడకలతో దేశంలోనే అతిపెద్ద ఐసియూలో ఒకటిగా ఉందని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వైద్యరంగానికి మరిన్ని నిధులను వెచ్చిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 10 బెడ్‌ల ఐసియూలకు నిధులు సమకూర్చామని, రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మరో 100 జిల్లా ఆస్పత్రులకు నిధులు సమకూర్చనున్నట్టు యూఎస్‌ఏలోని ఖోస్లా వెంచర్స్, సిఎ, వ్యవస్థాపక భాగస్వామి, వినోద్ ఖోస్లా తెలిపారు. 10 బెడ్‌ల ఐసియూ సహా వ్యవస్థాపకుడు, ఆధార్ వ్యవస్థాపకుడు శ్రీకాంత్ నాధముని మాట్లాడుతూ దేశంలోని ప్రతి జిల్లాలో ఐసియూ యూనిట్లను ప్రారంభిస్తామన్నారు.

KTR inaugurates 10 bedded in ICU center in Narayanpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News