Thursday, May 9, 2024

ప్రశ్నను పోషించండి

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు ప్రశ్నించేతత్వాన్నిపెంచుకోవాలి 
మాది సంస్కారవంతమైన ప్రభుత్వం
సిరిసిల్లలో కార్పొరేట్లకు దీటుగా జెడ్‌పి ఉన్నత పాఠశాలను ప్రారంభిస్తూ మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/కరీంనగర్ ప్రతినిధి/సిరిసిల్ల: విద్యార్థులు ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర ఐటి, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం సిరిసిల్లలో ఆధునిక హంగులతో కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉద్యోగాల కోసం కాకుండా పది మందికి ఉద్యోగాలు కల్పించేలా విద్యార్థులు విద్యాభ్యాసం కొనసాగించాలన్నారు.

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో మౌళిక వసతులు దశలవారీగా కల్పిస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చి సిరిసిల్ల జిల్లా పరిషత్ పాఠశాల మాదిరిగా అన్ని పాఠశాలలను ప్రభుత్వంతో చేతులు కలిపి అభివృద్ధి చేయాలన్నారు. సిరిసిల్ల నుండే ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో నిర్మాణం కావడం, అన్ని హంగులతో సమకూర్చుకోవడం వంటి మార్పు సిరిసిల్ల నుండే ప్రారంభం కావడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. పాఠశాలల్లో చదువుతో పాటుగా క్రీడలను ప్రోత్స హించాలన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇందుకోసం కృషి చేయాలన్నారు. ప్రపంచం అబ్బురపడే పౌర సమాజం తయారు కావాలనేది సిఎం కేసీఆర్ లక్ష్యమని, అందుకే దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, ఓసిల్లో ఆర్థికంగా వెనుకబడిన పిల్లల కోసం గత ఆరున్నర సంవత్సరాల్లో 945 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి విద్యార్థిపై లక్షా ఇరవై అయిదు వేల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. విద్యార్థులు తెలుగుకంటే ఇంగ్లీష్‌లోనే ప్రావీణ్యం అధికంగా ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం సన్న బియ్యంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న సంస్కారవంతమైన ప్రభుత్వం తమదన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విదేశాలకు వెళ్లే విద్యార్థులకు మహాత్మాజ్యోతిభాపూలే, మహాత్మాగాంధీ స్కాలర్ షిప్పులు 20 లక్షల రూపాయలను అందిస్తోందన్నారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
తెరాస పార్టీ కార్యకర్తలు అదైర్మపదవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా తననే కలవవచ్చునని చందుర్తి పర్యటనలో కార్యకర్తలు మంత్రి కేటీఆర్ సూచించారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వంలో పల్లెల్లో ప్రగతి పనులు జోరుగా సాగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. అన్ని కులాలకు సమానంగా ప్రాధాన్యం ఇస్తూ సంక్షేమ పథకాలు చేపట్టడం జరుగుతోందని పేర్కొన్నారు.
ఆ రెండు సెగ్మెంట్లను అభివృద్ధి చేస్తా
జోడెడ్ల మాదిరిగానే వేములవాడ, సిరిసిల్ల సెగ్మెంట్లను అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ తెలిపారు. రైతు వేదికలు రైతు ఆలోచనలకు వేదికలు కావాలన్నారు. సిరిసిల్ల లో మొదటిసారిగా కోనరావుపేట మండలంలో రైతు వేదికలను ప్రారంభం చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తమ రెడ్డ, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్, సహకార సంఘాల జాతీయ అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, జడ్పీ చైర్మన్ అరుణ, మున్సిపల్ చైర్ పర్సన్ కళచక్రపాణి, కలెక్టర్ కృష్ణ భాస్కర్, హెచ్‌ఎం గాజుల భాగ్యరేఖ పాల్గొన్నారు.

KTR Inaugurates Govt High School in Sircilla

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News