Monday, April 29, 2024

కాంగ్రెస్ గెలుస్తుందని.. రేవంత్ రెడ్డి సొంతూరోళ్లే అనుకోలే: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితాడని ముందే చెప్పి ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకపోతుండే అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం అచ్చంపేటలో నిర్వహించిన సమావేశంలో కెటిఆర్ పాల్గొని మాట్లాడారు. రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎవరు అనుకోలేదని చెప్పారు.

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడడం లేదు… లంకె బిందెల దొంగ లెక్క మాట్లాడుతున్నాడని విమర్శించారు. లంకె బిందెల కోసం దొంగలు అర్ధరాత్రి తిరుగుతారు.. కానీ సచివాలయంలో రాజకీయ నాయకులు తిరగరని చరుకలు అంటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు కోసం రైతులు మోహాలు చూసుకునే పరిస్థితి వచ్చిందని ఫైర్ అయ్యారు. కరెంటు కోతలు, తాగునీటి గోసలు ప్రారంభమయ్యాయని.. ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.

మిషన్ భగీరథను నిర్వహించే తెలివి కూడా ఈ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు కెటిఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులే అధికారంలోకి వస్తామని అనుకోలేదని… అందుకే అడ్డగోలుగా హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. అప్పుడేమో అందరికీ అన్ని.. ఇప్పుడేమో కొందరికి మాత్రమే ఇస్తామంటున్నారని ఆయన అన్నారు.

రైతులకు రెండు లక్షల రుణమాఫీ.. ఆడబిడ్డలకి ప్రతినెలా రూ.2,500.. ఇంట్లో అవ్వతాతలకు ఇద్దరికీ రూ.4,000 చొప్పున ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయడం లేదని విమర్శించారు.

ఎలక్షన్ కమిషన్ లెక్క ప్రకారం.. ఒకటి కాదు రెండు కాదు కోటి 67 లక్షల మంది ఆడబిడ్డలున్నారని… వాళ్లందరికీ నెలకు రూ.2,500 ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు…కోటి 24 లక్షల గ్యాస్ సిలిండర్ కనెక్షన్లు ఉన్నాయి… వాళ్ళందరూ ఎదురుచూస్తున్నారని చెప్పారు.

ఎన్నికల సమయంలో 200 యూనిట్ల వరకు ఉచితంగా అందరికీ అన్ని ఇస్తా అన్నారని.. కానీ ఇప్పుడు కొందరికే అంటున్నారని మండిపడ్డారు. వందరోజుల పాటు ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం అనుకున్నాము… శ్రీకృష్ణుడు శిశుపాలుడి 100 తప్పులు లెక్కపెట్టినట్లు ఆగుదామనుకున్నాం.. కానీ తొలి అసెంబ్లీ సమావేశంలోనే మా పార్టీ పైన, మా పార్టీ అధినేత పైన అడ్డగోలుగా విమర్శలు చేశారని కెటిఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చరిత్రను ఎవరు చెరిపేయలేరని ఆయన అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News