Thursday, May 9, 2024

ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శనలు…..

- Advertisement -
- Advertisement -

Kuchipudi dance

మనతెలంగాణ/కొండాపూర్: మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న నేషనల్ హ్యండ్లూమ్ ఎక్స్‌పోకు సందర్శకులను మంచి స్పందన వస్తుందని నిర్వహకులు తెలిపారు. గురువారం ఆంఫీథీయేటర్‌లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలో విజయవాడకు చెందిన నళిని శిష్య బృందం చే కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన శిల్పారామం పేక్షకులను ఎంతగానో అలరించింది. ఆనంద నర్తన గణపతిమ్, వచ్చెను అలివేలు మంగ, శంకర శ్రీగిరి, ఒకపరి కొకపరి, అర్పణం, ముద్దగారేయ్ యశోద, శివతాండవం, పలుకు తేనెల్ల తల్లి, ఎవడెయ్ వాడు పదం మొదలైన అంశాలపై కృష్ణవేణి, నళిని, దామిని, నవ్య, నందినలు నృత్యాలతో మెప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News