Monday, April 29, 2024

వాంకిడిలో పని భారంతో ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజరు ఆత్మహత్య….

- Advertisement -
- Advertisement -

వాంకిడి: పని భారం తట్టుకోలేక ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కుమ్రుం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వాంకిడిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బానోతు సురేష్ అనే వ్యక్తి పని చేస్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి బ్యాంకులో విధులు ముగించే సమయం రాత్రి 7.30 నుంచి 8.30 అవుతుండడంతో పని భారం తట్టుకోలేకపోతున్నాడు. అగష్టు 17న రాత్రి 7.30 గంటలకు విధుల నిర్వహిస్తున్న సమయంలో పురుగుల మందు తాగాడు. వెంటనే వాంతులు చేసుకోవడంతో బ్యాంకు సిబ్బంది ఏమైందని ప్రశ్నించారు. బ్యాంకు సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఆసిఫాబాద్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యు కోసం మంచిర్యాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి కరీంనరగ్ ఓ ఆస్పత్రిలో ఐసియులో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో చనిపోయాడు. బ్యాంకులు పని భారం ఎక్కువ కావడంతో ఎక్కువ గంటల పని చేయాల్సి రావడంతో ఒత్తిడి గురవుతున్నానని పలుమార్లు భార్య ఎదుట అతడు తన గోడును వెళ్లబోసుకున్నాడు. పని భారంతోనే చనిపోయి ఉంటాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఇంకొద్ది గంటల్లోనే చంద్ర విజయం..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News