Monday, April 29, 2024

దోమల నివారణకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

Large-scale programs for mosquito control

మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఎంటమాలజీ విభాగం చీఫ్ ఎం టమాలజిస్ట్ డాక్టర్ రాంబాబు చార్మినార్ జోన్ పరిధిలో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన చాంద్రాయణగుట్ట ఎంటమాలజీ వర్క్ నంబర్ 22 సిబ్బంది హాజ రు పాయింట్‌ను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది వాడుతున్న రసాయనాలను పరిశీలించి పైరేత్రం పిచికారీ చేయించారు. ఓ బస్తీలోని ఓ ఇంటి పరిసరాలో ఉన్న మట్టి కుండలను శుభ్రం చే యించి తగిన జాగ్రత్తలను సూచించా రు. అక్కడి నుంచి గుర్రం చెరువు ప్రాం తంలో డ్రోన్ల సహాయంతో జరుగుతు న్న స్ప్రేయింగ్ పనులను ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి ఆయన సంతోష్‌నగర్ సర్కిల్ పరిధిలోని గౌలిపురలో ని డెంగీ అనుమానిత ప్రాంతాల్లో పర్యటించారు.

డెంగీ వ్యాధి నివారణకు సం బంధించి కర పత్రాలను స్థానిక నాయకులతో కలసి విడుదలు చేశారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ 100 రోజుల స్పేషల్ డ్రైవ్‌లో భాగంగా ఆకస్మిక పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. వర్షకాలంలో వచ్చే దోమ కాటు వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిపించాలని కోరారు. గ్రేటర్ పరిధిలో ఈ ఏడాది దోమల నివారణకు సంబంధించి వర్ష కాలానికి సరిపడే రసాయనాలను సమాకూర్చుకోవడం జరిగిందన్నారు. 300 చిన్నా, 64 పెద్ద ఫాగింగ్ యంత్రాలను వినియోగించడంతో పా టు మస్కిట్ మిషన్ పైరేత్రమ్ స్ప్రేకు ప వర్ స్ప్రేలు, పిచికారికి నాప్ సాక్ స్ప్రే లు, ఆయిల్ బాల్స్, గంబుషియా చేప పిల్లలను వినియోగిస్తున్నట్లు రాంబాబు వెల్లడించారు. ఈ తనిఖీల్లో కాంచన్ బాగ్ కార్పొరేటర్ అబ్దుల్ రహమాన్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News