Monday, April 29, 2024

పెట్‌షాపులు, డాగ్ బ్రీడర్లపై నజర్

- Advertisement -
- Advertisement -

Licenses for pet shops and dog breeders

 

జంతు సంక్షేమ బోర్డులో రిజస్ట్రేషన్ ఉంటేనే పెట్ షాపులు, డాగ్ బ్రీడర్లకు లైసెన్స్‌లు
రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ 81 పెట్ షాపులు, 9 డాగ్ బ్రీడర్లకు బల్దియా నోటీసులు జారీ
అనుమతి లేని షాపులు 31 తర్వాత సీజ్

మన తెలంగాణ /సిటీ బ్యూరో: నగరంలో జాతి కుక్కల అక్రమ అమ్మకాలపై రాష్ట్ర యానిమల్ వెల్ఫేర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది. కొంద మంది పెట్ నిర్వాహకులు ఏలాంటి అనుమతులు లేకుండా ఇళ్లలో కుక్కలను పెంచుతూ వాటిని ఇష్టారీతిన అధిక మొత్తాలకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. అక్రమ పెట్ షాపులు, డాగ్ బ్రీడర్స్ (కుక్కల పెంపకం, అమ్మకపుదారులు) కట్టడి చేసేందుకు యానిమల్ వెల్ఫేర్ బోర్డు చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఈ వ్యాపారం చేసే వారు తప్పనిసరిగా రాష్ట్ర జంతు సంక్షేమ మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ నోటీసులను జారీ చేసింది. రిజిస్ట్రేషన్ ఉంటే తప్ప జిహెచ్‌ఎంసి ఇందుకు సంబంధించి లైస్సెన్స్‌లు జారీ చేయబోమంటే బల్దియా తేల్చి చెప్పింది. నగరంలో ఏలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా జంతువులు, పక్షుల అమ్మకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని కొంత మంది పెట్ షాప్స్, డాగ్ బ్రీడర్స్ నిర్వాహకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫిర్యాదులు పదేపదే అందుతుండడంతో దీనిపై దృష్టి సారించిన అధికారులు జంతు సంక్షేమ మండలి అనుమతిని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్ర జంతు సంక్షేమ మండలిలో వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ గ్రేటర్ పరిధిలో 82 పెట్ షాపులు, 9 డాగ్ బ్రీడర్స్‌కు జిహెచ్‌ఎంసి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 31లోపు తప్పనిసరిగా లైస్సెన్స్‌లు తీసుకోవాలని లేకపోతే సీజ్ చేయనున్నట్లు నోటీసులో హెచ్చరించింది.

తనిఖీల తర్వాతే అనుమతులు

పెట్ నిర్వహణకు సంబంధించి, కుక్కుల పెంపకం, అమ్మకదారులు తమ సంస్థలను ముందుగా జంతు సంక్షేమ మండలిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి దరఖాస్తులు అందిన వెంటనే జంతు సంక్షేమ మండలి ఆయా షాపులు సెంటర్లలో జంతువులు, పక్షులను నియమ నిబంధనలకు ప్రకారం పెంచుతున్నారా లేదా అని తనిఖీలు నిర్వహించి పూర్తిగా సంతృప్తి చెందిన తర్వాత ఆయా సంస్థలను రిజిస్ట్రేషన్ చేయనున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఉంటేనా షాపుల నిర్వహణకు బల్దియా లైస్సెన్స్‌లను జారీ చేయనుంది. ఇదే క్రమంలో నోటీసులు అందుకున్న 82 పెట్ షాపుల్లో 77 , 9డాగ్ బ్రీడర్లలో 8 సంస్థలు దరఖాస్తులు చేసుకున్నాయి. దీంతో ఆయా షాపుల్లో జంతు సంక్షేమ మండలి అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియమ నిబంధనల మేరకు నిర్వహించని షాపుల రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. దీంతో జంతు సంక్షేమ మండలి అనుమతి పత్రం ఉంటేనే బల్దియా లైస్సెన్స్‌లను జారీ చేస్తుందని, లేకపోతే సెప్టెంబర్ 1 తర్వాత షాపులను సీజ్ చేస్తామని జిహెచ్‌ఎంసి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News