Monday, April 29, 2024

ఎల్‌ఆర్‌ఎస్‌లకు కొత్త సాఫ్ట్‌వేర్

- Advertisement -
- Advertisement -

ఎల్‌ఆర్‌ఎస్‌లకు కొత్త సాఫ్ట్‌వేర్

సర్వే నంబర్ల ఆధారంగా దరఖాస్తుల పరిష్కారం
మండలాల వారీగా రెవెన్యూ, ప్లానింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసే సూచన
పైనుంచి ఆదేశాలు రాగానే క్రమబద్ధీకరణ ఫీజు వసూలు

మన తెలంగాణ/హైదరాబాద్: ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులకు త్వరలో మోక్షం లభించనుంది. ఆధునిక సాంకేతిక వ్యవస్థతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా (రెవెన్యూ, ప్లానింగ్, పంచాయతీరాజ్, ఇరిగేషన్)తో కూడిన పలు టీమ్ లను దీనికోసం ప్రభుత్వం నియమించినట్టుగా తెలిసింది. క్రమబద్ధీకరణ ఫీజు జనవరి 31వ తేదీలోగా పూర్తిగా చెల్లించాల్సి ఉండడంతో ఈనెలలో దీనిపై సిఎం కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల స్క్రూటినీ సైతం పూర్తయినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే నెల 31వ తేదీ వరకు క్రమబద్ధీకరణ ఫీజు ఆఖరు కావడంతో రెండు, మూడు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే 2020లో వచ్చిన దరఖాస్తులతో పాటు 2015లో వచ్చిన ఎల్‌ఆర్‌ఎస్ (48,553) దరఖాస్తులను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. 2015లో హెచ్‌ఎండిఏకు 1,76,102 దరఖాస్తులు రాగా, 88,117 ఫైనల్ ప్రోసీడిం గ్స్ (డిజిటల్ సైన్)తో జారీ చేశారు. 12,133 దరఖాస్తులను మాస్టర్‌ప్లాన్‌లో రోడ్డు, బఫర్ జో న్‌లో ఉన్నాయని వివిధ కారణాలతో వాటిని తి రస్కరించారు. ఇవికాక అధికారులు ఆమోదించినా ఫీజులు చెల్లించాల్సినవి 14,425 దరఖాస్తులు ఉన్నాయి. ఫైనల్ ప్రోసీడింగ్స్ కోసం పి ఓల వద్ద 104, డిజిటల్ సైన్ చేయకుండా ఫై నల్ ప్రోసీడింగ్స్ కోసం 633, షార్ట్‌ఫాల్స్‌లో 17 ఉన్నాయి. ఇన్సియల్ ఫీజు (రూ.10 వేలు) చెల్లించని 9,545 దరఖాస్తులుండగా, మొత్తం 48,533 దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయి.
అక్టోబర్ 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 25,59,562 దరఖాస్తులు
ప్లాట్లు, అక్రమ లే ఔట్లకు క్రమబద్ధీకరణ నిమిత్తం ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించిన నేపథ్యంలో భారీగా ప్రజలు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని అక్రమ, అనధికార లే ఔట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణను తప్పనిసరి చేస్తూ ఆగష్టు 31వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. చివరి గడువు అక్టోబర్ 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 25,59,562 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు వచ్చాయి. గ్రామ పంచాయతీల నుంచి 10,83,394 దరఖాస్తులు రాగా, మున్సిపాలిటీల్లో 10,60,013 దరఖాస్తులు, కార్పొరేషన్‌ల నుంచి 4,16,155 దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు ఎక్కువగా హెచ్‌ఎండిఏ, జిహెచ్‌ఎంసి పరిధి నుంచే వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ స్థలాలకు, అర్భన్ ల్యాండ్ సీలింగ్ మిగులు భూములకు, దేవాదాయ భూములకు, చెరువుల శిఖం భూముల ప్లాట్లకు ఈ ఎల్‌ఆర్‌ఎస్ వర్తించదని ప్రభుత్వం ముందస్తుగానే పేర్కొనడంతో చాలామంది నిరాశచెందారు.
కొత్త సాఫ్ట్‌వేర్ రూపొందించిన జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, డిటిసిపి
ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ స్థానంలో కొత్త సాఫ్ట్‌వేర్‌ను ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల కోసం వినియోగించినట్టుగా తెలిసింది. జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, డిటిసిపి ప్లానింగ్ అధికారులు కలిపి కొత్త సాఫ్ట్‌వేర్‌కు రూపకల్పన చేశారని సిఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ రాగానే వెంటనే క్రమబద్ధీకరణ ఫీజును చెల్లించేలా ఉత్తర్వులు జారీ చేయనున్నట్టుగా సమాచారం. ధరణి వెబ్‌సైట్‌ను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ, నిషేధిత భూములు, చెరువులు, కుంటలు, కలిగిన ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయనున్నారు. సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా దరఖాస్తులను పరిష్కరించడానికి సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసినట్టుగా తెలిసింది. మండలాల వారీగా రెవెన్యూ, ప్లానింగ్, పంచాయతీరాజ్,, ఇరిగేషన్‌కు చెందిన అధికారుల బృందం పరిశీలించి ఏఏ సర్వే నెంబర్‌లలో ప్లాట్లను క్రమబద్ధీకరించాలో నిర్ణయిస్తారు. దానికి అనుగుణంగా సంబంధిత సర్వే నెంబర్‌లలో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు చెల్లించాల్సిన ఫీజును కొత్త సాఫ్ట్‌వేర్ దరఖాస్తుదారుడికి అప్‌డేట్ చేసేలా ప్రభుత్వం కొత్త విధానాన్ని రూపొందించింది.
కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా..
వరంగల్ అర్భన్, ములుగు జిల్లాలోని మున్సిపాలిటీల నుంచి ఒక్క దరఖాస్తు కూడా రాకపోగా, ఈరెండు జిల్లాలోని గ్రామ పంచాయతీల నుంచి మాత్రమే దరఖాస్తులు వచ్చినట్టుగా అధికారులు పేర్కొంటున్నారు. ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను చూసుకుంటే ఎక్కువగా గ్రామ పంచాయతీల నుంచి దరఖాస్తులు వచ్చాయని, అనధికార లే ఔట్లు ఎక్కువగా గ్రామ పంచాయతీల్లోనే చేయడంతో అక్కడి నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని అధికారులు పేర్కొంటున్నారు. ఇక గ్రామ పంచాయతీల కన్నా మున్సిపాలిటీల్లో సుమారు 20వేల పైచిలుకు దరఖాస్తులు మాత్రమే తక్కువగా వచ్చాయని, ఈ మధ్య కొత్తగా గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా ఏర్పడిన వాటి నుంచే ఈ దరఖాస్తులు అధికంగా వచ్చాయని అధికారుల గణాంకాల్లో పేర్కొన్నారు.

LRS Regulation Fee Last date on Dec 31

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News