Monday, April 29, 2024

బిజెపి 15 ఏళ్లలో చేసింది… నేను 15 నెలల్లో చేశాను: కమల్ నాథ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిజెపి 15 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి తాను 15 నెలల్లో చేసి చూపించానని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తెలిపారు. కమల్‌నాథ్ కాపేపట్లో మధ్య ప్రదేశ్ గవర్నర్‌ లాల్జీ టాండన్ ను కలువనున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మధ్య ప్రదేశ్‌లో సమర్థవంతమైన పాలన అందించామని, రాష్ట్రానికి కొత్త రూపు ఇవ్వడానికి ప్రయత్నం చేశానన్నారు. తమ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు బిజెపి ప్రయత్నించిందని కమల్‌నాథ్ మండిపడ్డారు. బిజెపి తమ ఎంఎల్‌ఎలను కర్నాటకలో బంధించిందన్నారు. ఐదేళ్ల పాలన కోసం ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారని, కానీ బిజెపి తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేసిందన్నారు. ప్రజా తీర్పును బిజెపి అపహాస్యం చేస్తోందని కమల్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బలపరీక్షకు ముందే  ముఖ్యమంత్రి పదవికి కమల్ నాథ్ రాజీనామా చేసినట్టు సమాచారం.

 

Madhya Pradesh CM Kamal Nath addresses the media, CM Kamal Nath: The people of this country can see the truth behind the incident where MLAs are being held hostage in Bengaluru…The truth will come out. People will not forgive them.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News