Sunday, April 28, 2024

మహారాష్ట్రలో కోవిడ్ తో ఒక్క రోజే తొమ్మిది మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మండుగురు కోవిడ్ తీవ్రతతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం వెలువరించిన కోవిడ్ గణాంకాల వివరణాత్మక ప్రకటనలో తెలిపారు. ఈ మధ్యలో ఈ వైరసతో ఇంత మంది ఒక్కరోజే మృతి చెందడం, రాష్ట్రంలో 1115 కొత్త కేసులు తలెత్తడంతో ప్రమాదఘంటికలు వెలువడుతున్నాయి. మహారాష్ట్రలో రాజధాని ముంబైలోనే కొత్తగా 320 కరోనా కేసులు రికార్డు కాగా, ఇద్దరు వైరస్ తీవ్రతతో కన్నుమూశారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం 5421 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీటిలో ముంబైలోనే 1577 మంది ఇప్పుడు తీవ్రస్థాయి వైరస్‌తో చికిత్స పొందుతున్నారని గణాంకాలతో వెల్లడైంది.

ఇప్పుడు మహారాష్ట్రలో నెలకొన్న కొత్త కేసులతో మొత్తం మీద ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 81,52,291కు చేరుకుంది. రాష్ట్రంలో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య ఇప్పటి మరణాలతో మొత్తం మీద 1,48,470కు చేరుకుంది. వీటిలో ఒక్క ముంబైలోనే మొత్తం మృతుల సంఖ్య ఇప్పటివరకూ 19,752కు చేరుకుంది. ఒక్కరోజు క్రితం మహారాష్ట్రంలో 919 కొత్త కేసులు నమోదు కాగా, వైరస్ తీవ్రతతో ఒక్కరు మరణించారు. అయితే మరుసటిరోజుకు ఈ మరణాల సంఖ్య తొమ్మిదికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్రతను తెలిపింది. దేశంలో కరోనా సంబంధిత ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ అయిన ఎక్స్‌బిబి. 1.16తో వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

Also Read: బిఆర్‌ఎస్‌పై ఈసి కి ఫిర్యాదు : రఘునందన్‌రావు

దీని పట్ల ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , ఆసుపత్రులలో చికిత్సకు వచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉందని ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది.అయితే మహారాష్ట్రలో ఇందుకు విరుద్ధంగా కరోనా ఉధృతి, సంబంధిత మరణాలు ఎక్కువ కావడంతో , ముంబైలో ఎక్కువగా ప్రభావం ఉండటంతో వైరస్ ఏ స్థాయికి చేరుతుంది? ఇతర ప్రాంతాలకు సోకుతుందా? అనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7830 కొత్త కరోనా కేసులు రికార్డు అయ్యాయి. గత ఏడు నెలల్లో ఇది అత్యధిక నమోదుగా నిలిచింది. అయితే ఇప్పుడు కోవిడ్ ఎండెమిక్ దశకు చేరుకుందని, వచ్చే పది లేదా పన్నెండు రోజులు కేసులు పెరుగుతాయని, తరువాత తగ్గుముఖం పడుతాయని అధికారవర్గాలు తెలిపాయి.

దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ ఇంతకు ముందటి మహమ్మారి దశ నుంచి ఎండెమిక్ స్థాయికి చేరుకుని ఓ నిరిష్ట ప్రాంతానికి పరిమితం అయిందని, తగు జాగ్రత్తలు తీసుకుంటే దీనిని నియంత్రించవచ్చునని అధికారులు తెలియచేయడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి మహారాష్ట్రపై ప్రత్యేకించి మహానగరం, జనసమ్మర్థపు ముంబైపై పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News