Sunday, April 28, 2024

దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి

- Advertisement -
- Advertisement -

గద్వాల : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి అన్నారు. శనివారం గద్వాల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి ప్రతాప్‌గౌడ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గద్వాల ఎమ్మెల్యే హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి మండలాభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. సిఎం కెసిఆర్ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. అంతకు ముందు ఎంపిపి అధ్యక్షతన నిర్వహించిన సర్వసమావేశంలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు.

గ్రామాల్లో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో అధికారులు నిర్లక్షంగా వ్యహరిస్తున్నారని, అభివృద్ద్ది పనులపై అధికారుల నిర్లక్షదోరణి నిరసిస్తూ గద్వాల పిఎసి యస్ ఎంఏ సుభాన్ సర్వసభ్య సమావేశం నుంచి వెళ్లిపోయారు. అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో గ్రామాల్లో మహిళా సంఘాలు పాల్గొనడం లేదని ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు ఎంపీపీ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎంపీపీ అక్కడ ఏపియంపై అగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్ది ఉత్సవాల్లో అన్ని వర్గాల వారు పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ దామోదర్, ఎంపీడీఓ చెన్నయ్య, వివిధ శాఖల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులుపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News