Monday, April 29, 2024

వివాహిత ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

నవీపేట్ : మండల కేంద్రానికి చెందిన ఎర్ర కావ్య (25) అనే వివాహిత గురువారం ఫ్యాన్‌కు ఉరివేసుకొని మరణించింది.ఎసిపి కిరణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… నవీపేట్‌కు చెందిన ఎర్ర మనోజ్‌తో రెండున్నర ఏళ్ళ క్రితం కావ్యకు వివాహం అయ్యింది. అయినపట్పటికీ పెళ్లికి ముందు నుంచి మనోజ్ వివాహేతర సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఆమె మనస్తాపానికి గరియై ఇంట్లో అందరు ఉన్న సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కావ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News