Sunday, April 28, 2024

నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలి

- Advertisement -
- Advertisement -

మహబూబ్‌నగర్ బ్యూరో : జిల్లాలో మలేరియా, ఇతరత్ర విషజ్వరాల నియంత్రణ చల్లి దిశగా జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కేంద్ర కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ , బొదకాలు, మెదడు వాపు, చికెన్ గున్యా ఇతరత్రా వఆదులు వ్యాప్తి చెందుతాయని అన్నా రు. పాఠశాలలు, వసతి గృహలు పరిశుభ్రతలు పాటించాలన్నా రు. మంచినీటి ట్యాంక్‌లను ఎప్పటికి ఎప్పుడు శుభ్ర పర్చాలన్నారు.

ఇండ్లు, ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు, చెత్తాచెదా రం నిల్వచేయడం, అపరిశుభ్ర వాతావరణంలో దోమలు వృద్ధి చెందుతాయని, ఈ నేపథ్యంలో ఇంటి పరిసరాలు, ఆవరణ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, డ్రమ్ములు, సంపులపై మూత వేసి ఉంచాలని తెలిపారు. పారిశుద్య నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని, వ్యాధులు ప్రబలినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేయడంతో పాటు అవగాహన సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని, ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.

నూట్రిషన్ కిట్స్‌లను నారాయణపేట, మక్తల్ , కోస్గీ ఆసుపత్రులలో అందించాలన్నారు. ఆసుపత్రులలో వసతులపై డాక్టర్లతో అడిగి తెలుసుకున్నారు. ఇంక మెరుగైన వైద్యానికి కావాల్సిన సదుపాయాలు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వై ద్య ఆరోగ్య శాఖ అధికారి డా. రాం మనోహర్‌రావు, డాక్టర్ శై లజ, డాక్టర్ సౌభాగ్యలక్ష్మి, డిఈఓ కన్యాకుమారి, రంగారావు, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. రంజిత్, పావని, పద్మనళిని, బలరాం, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News