Sunday, April 28, 2024

టాలీవుడ్ హీరోల సర్ ప్రైజ్ పోస్టర్స్..

- Advertisement -
- Advertisement -

Mike Tyson's first look released from LIGER

హైదరాబాద్: దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ హీరోలు తమ అభిమానులకు సర్ ప్రైజ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం వారు నటించే సినిమాల అప్డేట్స్, పోస్టర్స్ లతో అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, డైరెక్టర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లైగ‌ర్. పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో నటిస్తున్న అంతర్జాతీయ బాక్సర్ మైక్ టైసన్ పోస్టర్ అభిమనులతో పంచుకుంది మూవీ మేకర్స్.

ఇక, గద్దలకొండ గణేష్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం గని, ఎఫ్ 3 సినిమాలు చేస్తున్నాడు. గని మూవీ నుంచి కొత్త పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా నుంచి సాయి పల్లవి, కృతిశెట్టి, మడోన్నాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ లను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.

వీరితోపాటు అక్కినేని కింగ్ నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న చిత్రం బంగార్రాజు. అభిమానులకు దీపావళీ శుభాకాంక్షలు తెలుపుతూ వీడియోను విడుదల చేసింది.

సాయికుమార్ తనయుడు ఆది ప్రస్తుతం నటిస్తున్న చిత్రం తీస్ మార్ ఖాన్. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది.

Mike Tyson’s first look released from LIGER

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News