Saturday, May 11, 2024

ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన స్టడీ సర్కిల్ విద్యార్థులు అభినందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రిలిమ్స్ 2023 లో తెలంగాణ స్టడీ సర్కిల్ లో చదివిన 14 మంది విద్యార్థులు అర్హత సాధించారు. వీరిలో షెడ్యూల్ కులాల కేటగిరికి చెందిన ఆరుగురు, షెడ్యూల్ తెగలకు చెందిన ముగ్గురు, వెనుకబడిన వర్గాలకు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు. జనగామ కు చెందిన ప్రణయ్ కుమార్, నిజామాబాద్ కు చెందిన కిరణ్, హనుమకొండ కు చెందిన వివేక్, కిషన్ పటేల్, మహబూబ్ నగర్ చెందిన సుమేధ, వినోద్, రంగారెడ్డి జిల్లాకు చెందిన శశికాంత్, సురేష్, కరీంనగర్ కు చెందిన భార్గవ్, నిర్మల్ చెందిన అక్షయ్ పటేల్, భద్రాద్రి కొత్తగూడెం చెందిన రేవంత్, ములుగు జిల్లాకు చెందిన ప్రవీణ్ సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారికి ఎస్‌సి అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యారంగంలో తెలంగాణ ప్రభుత్వం చూపుతున్న ఆదరణతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని మంత్రి కొప్పుల చెప్పారు. పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఎంసెట్ పరీక్షల్లోనూ తెలంగాణ గురుకుల విద్యార్థులు మెరిట్ సాధించారని గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News