Friday, May 3, 2024

సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్

- Advertisement -
- Advertisement -

Minister KTR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడికోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ సేఫ్ హ్యాండ్స్ ఛాలె ంజ్ చేయగా రాష్ట్ర మంత్రి,టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు స్వీకరించి మరో ఆరుగురికి సవాల్ విసిరారు. ఈ సందర్భంగా కెటిఆర్ దేశప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, పియూష్ గోయల్, ఆంధ్ర ప్రదేశ్ సిఎం. జగన్మోహన్ రెడి.్డ సెల్స్ ఫోర్స్ సిఇఇఒ మార్క్ బెనియాకు సేఫ్‌హ్యాండ్స్ సవాల్ విసిరారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజుల క్రితం ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్లూటిఒ) సెక్రటరీ జనరల్ టెట్రోస్ ప్రపంచవ్యాప్తంగా సేఫ్‌హ్యాండ్స్ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కెటిఆర్ చేతులు కడుక్కుంటూ సందేశం ఇచ్చారు. సేఫ్ హ్యాండ్స్ ఛాలెంజ్‌ను సంతోషంగాస్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అత్యంతప్రధానంగా ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పారు. కరోనా వైరస్ అరికట్టేందుకు మనకు మనమే వ్యక్తిగతపరిశుభ్రత పాటించాలని చేతులను శుభ్రంగా ఎళ్లవేళల ఉంచుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ చేతులు శుభ్రంగా కడుక్కుంటున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్ అవుతుంది.

Minister KTR Safe Hands Challenge
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News