Monday, April 29, 2024

ఓ9 సొల్యూషన్స్‌కు మంత్రి కెటిఆర్ స్వాగతం

- Advertisement -
- Advertisement -

యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు దక్కే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్ : యుఎస్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన మార్కెట్ లీడింగ్, వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సప్లై చైన్ సాఫ్ట్‌వేర్ కంపెనీ o9 సొల్యూషన్స్, దాని గ్లోబల్ క్లయింట్‌ల కోసం ఆర్‌అండ్ డి, సేవల డెలివరీ సామర్థ్యాన్ని విస్తరించడానికి హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు విస్తరించనుందని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ వెల్లడించారు. తద్వారా రాబోయే రెండేళ్లలో తెలం గాణలో 1000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని తెలిపారు. చికాగోలో దాని సహ వ్యవస్థాపకుడు, సిఇఒ, చక్రి గొట్టెముక్కల నేతృ త్వంలోని o9 నాయకత్వ బృందంతో మంత్రి కెటిఆర్ సమావేశమయ్యారు. సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, పెట్టుబడి, ప్రమోషన్, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు ప్రత్యేక కార్యదర్శి ఇ.విష్ణువర్ధన్‌రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే, సప్లై చైన్ స్కిల్స్ అకాడమీ @o9solutions సప్లయ్ చైన్ డొమైన్‌లో గ్లోబల్ కంపెనీల కోసం తమ స్థానిక ఇంజనీరింగ్ ప్రతిభకు శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంతో భాగ స్వామ్యంతో అభివృద్ధి చేస్తామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. ఓ9 సొల్యూషన్స్‌కు మంత్రి కెటిఆర్ స్వాగతం పలికారు. తెలంగాణకు ప్రత్య క్షంగా 1000 ఉద్యోగాలతో పాటు, టాస్క్(టిఎఎస్‌కె)తో అనుబంధంగా ఉన్న సప్లై చైన్ సిల్క్ అకాడమీ, తయారీ కార్యకలాపాలు విస్తరిస్తు న్నందున యువతకు మరిన్ని అవకాశాలు సృష్టించగలవన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News