Monday, April 29, 2024

కష్టేఫలే

- Advertisement -
- Advertisement -

ఎంత కష్టపడితే అంత
గొప్పవారమవుతాం కార్మికుల
కోసం కెసిఆర్ ప్రభుత్వం అనేక
సంక్షేమ పథకాలు అమలు
చేస్తున్నది వారి శ్రమతోనే
కంపెనీలు నడుస్తున్నాయి

మల్లన్నా.. మజాకా!

మేడే ఉత్సవాల్లో కార్మిక దుస్తుల్లో ప్రసంగించిన మంత్రి మల్లారెడ్డి

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి

మనతెలంగాణ/ హైదరాబాద్ : మనం ఎంత కష్టపడితే అంత గొప్ప వాళ్లమవుతామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సిహెచ్ మల్లారెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులకు మేడే శుభాకాంక్షలను మం త్రి తెలిపారు. కార్మికుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. కార్మికుల శ్రమతోనే కంపెనీలు నడుస్తున్నాయని చెప్పారు. కార్మికులను అగ్రభాగానికి తీసుకెళ్లే బా ధ్యత తనదని మంత్రి హామీ ఇచ్చారు. కార్మికులు, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సిఎం కెసిఆర్ ప్ర భుత్వం పనిచేస్తున్నదని చెప్పారు. కార్మికుల శ్రేయ స్సు కోసం ప్రమాద బీమా అందిస్తున్నామన్నారు. కార్మికుల పిల్లల కోసం గురుకులాలు ఏర్పాటు చే శామని, మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా సర్కారు బడుల్లో ఇంగ్లిష్ మీడియంలో విద్య అందిస్తున్నామని చెప్పారు.

గతంలో జరిగిన కార్మి క ది నోత్సవాలు వేరు, తెలంగాణ వచ్చిన తర్వాత జరుగుతున్న మే డే వేడుకలు వేరన్నారు. నిర్మాణ రం గంలోని కార్మికుల సంక్షేమానికి బోర్డు ద్వారా గతేడాది రూ.176.91 కోల్లు లబ్ధ్ది చేకూర్చామన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వివిధ పథకాల ద్వా రా 32,350 మంది కార్మికులకు రూ.184.07 కోట్ల మేర ప్రయోజనం లభించిందన్నారు. కార్మిక శాఖలోని కార్యకలాపాలను పూర్తిగా ఆన్‌లైన్ చేయ డం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనేక జాతీయ అవార్డులను కైవసం చేసుకుందన్నారు. కార్మికుల సం క్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలను రాష్ట్ర కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి రాణీ కుముదిని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.

కార్మికులకు అవార్డులు ప్రదానం..

రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన 44 మం ది కార్మికులకు శ్రమ శక్తి అవార్డులను ప్రదానం చేశారు. వారిలో ఆర్‌విఎల్‌ఎన్ ప్రసాద్ (హైదరాబాద్), రవిసింగ్( రంగారెడ్డి), సారా ప్రభాకర్ , వెంకట శివశంకర్ (సంగారెడ్డి), వేమునూరి వెంకటేశ్వర్లు (మంచిర్యాల), రాజనాల రమేష్, మిట్ట సూర్యనారాయణ, వేంకటేశ్వరులు, దాసరి శ్రీనివాస్,తాటి సత్యనారాయణ, సందెల హరినాథ్, బిల్లా శ్రీకాంత్, బాస్కే దశరథం, మహ్మద్ రజాక్, ప్రభాకర్‌రావు, యాదయ్య, కె. గణేష్ రావు, మంద మల్లా రెడ్డి,పర్స బక్కయ్య, గండ్ర దామోదర్‌రావు, ముప్పాని సోమిరెడ్డి, ఎత్తరి అంతయ్య, శంభు ప్రభాకర్, నల్ల భారతి, రూప్‌చంద్ గల్లా నాగభూషయ్య,సామ కొండల్ రెడ్డి, భూమోళ్ల కృష్ణయ్య, బషీర్, కొమ్మగళ్ల బాలకృష్ణ, జంగిలి రవీందర్, జాహిద్ పాషా, మల్లేష్, వడ్డేపల్లి శంకర్, మంద రమేష్, పత్తిపురపు రామారావు, మచ్చ నర్సింహులు, సునీత, వరలక్ష్మీ,మరిపెల్లి మాధవి, రాధిక, సంకేపల్లి నర్సింహారెడ్డి ఉన్నారు.

బెస్ట్ మేనేజ్‌మెంట్లకు అవార్డులు

బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులను 12 సంస్థలకు ప్ర దానం చేశారు. వాటిలో ఎన్‌ఎస్‌ఎల్ కృష్ణవేణి షుగ ర్స్ లిమిటెడ్, ఎజిఐ గ్లాస్ ఫ్యాక్టరీ, సాగర్ సిమెం ట్స్ లిమిటెడ్, డాక్టర్ రెడ్డిస్, జిఒసిఎల్, ఎఆర్‌ఎఫ్ లిమిటెడ్, స్టాన్‌ప్లస్ టెక్నాలజీస్,మై హోమ్ కన్‌స్ట్రక్షన్, ఐటిసి భద్రాచలం, షాలోమ్ ఎంటర్‌ప్రైజెస్, గణేష్ రిగ్ పరిశ్రమ, ఎల్‌టి లిమిటెడ్ ఎస్‌ఎస్‌ఎంపిపిలకు ప్రదానం చేశారు.

ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు : మంత్రి

కరోనా కారణంగా అందరూ ఇంట్లోనే ఉంటూ ఓటిటిలో సినిమాలు చూడటం మొదలు పెట్టారు. ఈ అవకాశాన్ని సినీ కార్మికులు ఉపయోగించుకోవాలని మంత్రిమల్లారెడ్డి అన్నారు. ఆదివారం యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి స్టేడియం లో జరిగిన సినీ కార్మికుల మేడే ఉత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఎంతో మందికి అవకాశా లు ఇస్తూ ఓటిటిలో సినిమాలు తీయాలి. కాబోయే డైరెక్టర్లు, హీరోలు, ని ర్మాతలు, కార్మికులు.. అందరూ మీరే అవుతారు. ప్రయత్నం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఎంత గొ ప్ప వాళ్లెనా కావొచ్చు. మెగాస్టార్ చిరంజీవి అన్నా.. సినీ కార్మికుల కోసం మీరు కష్టపడాలి. ఇప్పటివరకు వారి కోసం ఎంతో చేశారు. సినీ కార్మికులు కూడా ధనవంతులు కావాలని మల్లారెడ్డి అన్నారు. మల్లారెడ్డి చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రులు మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క, మెగాస్టార్ చిరంజీవి, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News