Monday, April 29, 2024

రాష్ట్రంలో రక్తం నిల్వల సమస్య లేదు: మంత్రి శ్రీనివాస్ గౌడ్

- Advertisement -
- Advertisement -

V-Srinivas-Goud

హైదరాబాద్: నగరంలోని నారాయణగూడ ఐపిఎంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పర్యాటకశాఖ అభివృద్ధి సంస్థ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో తలసేమియా భాధితుల కోసం రక్తదానం చేపట్టామని ఆయన తెలిపారు. మంత్రి కెటిఆర్ పిలుపుమేరకు వారంపాటు రక్తదాన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. టిఆర్ఎస్ శ్రేణులు, ఉద్యోగులు, వారం నుంచి రక్తదానం చేస్తున్నారు. రాష్ట్రంలో రక్తం నిల్వల సమస్య లేదు. కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు అందరూ తగిన జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. మానవాళి జీవనశైలి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరిచారు. మద్యం దుకాణాలు తెరవకపోతే ఇతర రాష్ట్రాల కల్తీ మద్యం వచ్చే అవకాశం ఉంది. గుడుంబా వాడకం పెరుగుతుంది. ప్రజారోగ్య దృష్ట్యా మంత్రివర్గంలో  చర్చించి సిఎం కెసిఆర్ నిర్ణయిస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.

Minister Srinivas Goud inaugurated blood donation camp

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News