Monday, April 29, 2024

సినీపరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తాం: మంత్రి తలసాని

- Advertisement -
- Advertisement -

Talasani Srinivas Yadav, New approach to development of film industry Says Talasani

హైదరాబాద్: రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల సినీపరిశ్రమ ఇబ్బందులు పడుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సినీరంగంపై ఆధారపడి లక్షల మంది జీవనం సాగిస్తున్నారని వెల్లడించారు. వీలైనంత త్వరగా యథావిధిగా కార్యకలాపాలు సాగించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం పరంగా సినీరంగంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమకు కావాల్సిన సౌకర్యాలపై ఇప్పిటికే ప్రభుత్వంతో చర్చించామన్న ఆయన సినీ పరిశ్రమ అభివృద్ధికి నూతన విధానం తీసుకొస్తామని తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహకరించేందు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. లాక్ డౌన్ తర్వాత సినీపరిశ్రమ పెద్దలతో చర్చించి థియేటర్లపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తలసాని చెప్పారు.

New approach to development of film industry Says Talasani

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News