Sunday, April 28, 2024

కులగణన అంటరానిదిగా చూస్తున్న బిజెపి ప్రభుత్వం: ఎంఎల్ సి కవిత

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్  : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కులగణన అంటే అంటరానిదిగా భావిస్తుందని, అందుకే కులగణనను నిర్వహించడం లేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. సోమవారం నగరంలోని జిల్లా బిఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 2010 అప్పటి కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ 4వేల కోట్లు ఖర్చు చేసి కులగణనను చేపట్టిందని, కానీ దానిని పార్లమెంట్‌లో ఆమోదించలేకపోయిందన్నారు. ప్రస్తుతం కేంద్రంలో బిజెపి సర్కార్ ఏర్పడి 10 ఏళ్లు కావస్తున్నా కులగణనను చేపట్టేందుకు ఎందుకు భయపడుతుందో అర్థం కాకుండా ఉందన్నారు. కులగణనన అంటే అంటరానిదిగా బిజెపి ప్రభుత్వం భావిస్తుందని, లేకుంటే బిసి కులగణనను ఎందుకు నిర్వహించడం లేదని ఆమె ప్రశ్నించారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పార్లమెంట్‌లో ఆమోదించిందని, కానీ అమలుకు నోచుకోకపోవడం శోచనీయమన్నారు.

అలాగే ఓబిసిలకు 2004లో ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదన్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీ ఏమి సమాధానం చెబుతుందన్నారు. దేశంలో బిసిలకు రిజర్వేషన్లు అమలు చేయడంలేదని, దీనిని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ప్రశ్నించదని అన్నారు. కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ, బిసి రిజర్వేషన్లపై బిజెపిని ఎందుకు ప్రశ్నించదని, ఈ రిజర్వేషన్లపై నేపాన్ని బిజెపిపై నెట్టివేయడం ఎంత వరకు సమంజసమన్నారు. కులవృత్తులకు కేంద్ర ప్రభుత్వం చేయుతనివ్వడం లేదని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూమ్మాటికి బిసిల ప్రభుత్వమని, ముఖ్యమంత్రి కెసిఆర్ బిసిల ముఖ్యమంత్రి అని ఆమె పేర్కొన్నారు. సోమవారం నిజామాబాద్ అర్బన్ నుంచి షబ్బీర్ అలీ కొడుకు నామినేషన్ వేసినట్లు తెలిసిందని, కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ అర్బన్‌లో చెల్లుతుందా అని ఆమె ప్రశ్నించారు.

ఎన్నికలు మరో 20 రోజుల్లో వస్తున్నాయని, ప్రతిపక్షాలు ఎన్నికలవేళ ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని, వీరి ఆరోపణలను తిప్పికొట్టాల్సిన అవసరం బిఆర్‌ఎస్ నాయకులపై ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని 9స్థానాలను బిఆర్‌ఎస్ పార్టీ గెలుచుకుంటుందన్నారు. బిసి నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ బిసిల సంక్షేమానికి పాటుపడుతున్నా వ్యక్తి ముఖ్యమంత్రి కెసిఆర్ అని, అనేక సంక్షేమ పథకాలు బిసిలకు అందుతున్నాయన్నారు. ఇటీవల బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ బిసిలకు బిఆర్‌ఎస్‌లోనే అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని అన్నారు. ఖమ్మం ఎంపి వడ్డీ రాజు రవిచంద్ర మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, రైతులకు 24 గంటల కరెంటు బిఆర్‌ఎస్ ప్రభుత్వమే అందిస్తుందని పే ర్కొన్నారు. ఈ సమావేశంలో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, , క్రిస్టియన్ చైర్మన్ డి. రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ విజి. గౌడ్, నగర మేయర్ దండునీతూకిరణ్, మాజీ నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ రెడ్‌కో చైర్మన్ అలీం తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News