Sunday, April 28, 2024

దోచి దోస్తు ఖాతా నింపుతుండు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/బాన్సువాడ/పిట్లం: మోడీ మహానటుడు అని, ఆస్కార్ అవార్డుకు ఆయనను పంపితే పురస్కారం కూడా వచ్చేదని దేశ సంపదను ప్రజలకు పంచుతా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత అదానీ లాంటి వారికి దోచిపెడుతున్నారని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. పేద ప్రజల ఆమ్‌దాని డబు ల్ చేస్తానని అదానీ ఆమ్ దానిని డబుల్ చేస్తున్నాడన్నారు. బుధవారం జుక్కల్ నియోజకవర్గంలోని నిజాంసాగర్ మండలంలో నాగమడుగు ఎత్తిపోతల పథకం శంకుస్థాపనతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పిట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కెటిఆర్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్‌లకు డిపాజిట్ గల్లంతు చేయాలన్నారు. ఎన్నికల వేళ సంక్రాంతికి గంగి రెద్దుల వలే వస్తున్నారని, కర్రు కాచి వాత పెట్టేలా చేయాలన్నారు. సిఎం కెసిఆర్ పేదవాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారని, రాష్ట్రంలో జరగని అభివృద్ధి జరిగిందని కెటిఆర్ అన్నారు. దేశ సంపదను దోచి అదానీ ఖాతాల్లో నింపుతున్న మహానటుడు మోడీ అన్నారు.

55ఏండ్లు పాలించిన కాం గ్రెస్ అధికారంలో ఉండి ఏంచేయలేక ప్రస్తుతం ఒక్క ఛాన్స్ అంటూ ప్రజల చుట్టూ తిరగడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిపుత్రులను సర్పంచులను చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి హల్దివాగు, మల్లన్న సాగర్ ద్వారా నిజాంసాగర్‌కు గోదావరి జలాలను తీసుకుని వచ్చి రెండు పంటలకు నీరందిస్తున్నారన్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం నిర్మాణంతో 40 వేల ఎకరాలకు పైగా భూములకు నీరంది సస్యశ్యామలం కానున్నాయన్నారు. జుక్కల్ ఎంఎల్‌ఎగా హన్మంత్ షిండే ఉండటం నియోజకవర్గ ప్రజల అదృష్టమన్నారు. అప్పుడు కరెంట్ ఉంటే వార్త ప్రస్తుతం ఒక్క నిమిషం కరెంట్ పోతే వార్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోసం కోట్లాటలు జరిగేవని, ప్రస్తుతం తెలంగాణలో ఒక్క నిమిషం కరెంట్ పోతే వార్త అవుతుందన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణను పోరాడి సాధించుకున్నామని, ఒక్కొక్కటిగా అన్ని పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామన్నారు. విద్య, ఉద్యోగం, వైద్యం ఇలా అన్ని రకాలుగా అందజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధ్ది, సంక్షేమమే లక్షంగా ముందుకు సాగుతున్నారన్నారు.

తెలంగాణ ప్రభుత్వ హయాంలో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబందు, రైతుబీమా, పెన్షన్లు, డబుల్ బెడ్ రూంలు, ఉచిత కరెంట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ ఇలా అనేక రకాలుగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో కొనసాగుతున్నాయని, 55 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇవన్నీ చేశారా గుడ్డి గుర్రాల పండ్లు తోమారా అన్నారు. ఈ సందర్భంగా చిన్న పిట్ట కథను చెప్పారు. ఒకబ్బాయి చిన్నప్పటి నుంచి జులాయిగా తిరిగేవాడని, తాగుడుకు బానిసై పెద్దయ్యాక ఇంట్లో తండ్రి జేబులో నుంచి డబ్బులు తీస్తుండగా, తల్లి మందలించడంతో రోకలి బండతో కొట్టడంతో తల్లి చనిపోయిందని, తండ్రి ఆగ్రహించడంతో తండ్రిని కొట్టగా, తండ్రి కూడా చనిపోయాడన్నారు. దీంతో పోలీసులు జైలులో వేయగా జడ్జి వద్దకు తీసుకెళ్లారన్నారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి లాంటి జడ్జి ఉండేవాడని, ఎంతో మందిని చూశాను నీలాంటి వాడిని చూడలేదు అని అనగా, తల్లిదండ్రి లేని అనాథను సార్ నన్ను వదిలివేయ్యండి అంటూ ప్రార్థించాడని ఇలా ఉంది కాంగ్రెసోల్ల పరిస్థితి అన్నారు. జుక్కల్ నియోజకవర్గానికి పక్కనే గల కర్ణాటక, మహారాష్ట్రలో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి జరుగుతుందా అని ఒక్కసారి ప్రశ్నించాలన్నారు. ఇరిగేషన్ శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎంఎల్‌ఎ హన్మంత్ షిండే రైతుల కష్టాలు, ఇక్కడి ప్రాంత ప్రజల బాధలను చూసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సైతం వదిలి రాజకీయ గురువు పోచారం శ్రీనివాస్ రెడ్డి సలహాలు, సూచనలతో రాజకీయాల్లోకి వచ్చారన్నారు. ఎల్లప్పుడు ప్రజా సంక్షేమం, అభివృద్దిని ఆకాంక్షించే నాయకుడన్నారు.

జుక్కల్ నియోజకవర్గానికి వరాల జల్లులు

పిట్లం, బిచ్కుంద మండలాలను మున్సిపాలిటీలుగా ఏర్పాటు చేయాలని, నిజాంసాగర్, పెద్ద కొడప్‌గల్, డోంగ్లీలలో జూనియర్ కళాశాలలు, 11 తాండాలకు బీటి రోడ్లు మంజూరు, బ్రిడ్జిలకు నిధులు మంజూరు, రామలింగేశ్వరాలయంతో పాటు తదితర పలు రహదారులకు నిధులు, 8 లింకు రోడ్లు, పిట్లం, మద్నూర్ మండలాలకు డిగ్రీ కాలేజ్‌లు, పిట్లం, బిచ్కుంద మండలాలకు షాదీఖానాలు, పిట్లం, జుక్కల్‌లకు బంజారా భవన్‌లు, లెండికి 150 నుంచి 200 కోట్లు, మహ్మద్‌నగర్ నూతన మండలంగా ఏర్పాటు తదితర విషయాలను జుక్కల్ శాసన సభ్యులు హన్మంత్ షిండే మంత్రి కేటిఆర్ ముందుంచగా త్వరలోనే అన్నింటికి నిధులను మంజూరు చేసి, పిట్లం, బిచ్కుంద మున్సిపాలిటీలుగా చేయడంతో పాటు ఎమ్మెల్యే కోరిన కోరికలన్ని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.

రాబోయే ఎన్నికల్లో 72 వేల మెజార్టీతో ఎమ్మెల్యే హన్మంత్ షిండేను గెలిపించాలన్నారు. నిజాంసాగర్ మండలానికి దళితబంధు పథకం ద్వారా 1300 కుటుంబాలకు దళితబంధును అందజేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, బిగాల గణేష్, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, బీఆర్‌ఎస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దిన్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో రాజాగౌడ్, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎఎంసీ చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News