Monday, April 29, 2024

బైడెన్‌తో మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

ఇరువురి మధ్య ద్వైపాక్షిక చర్చలు

సమావేశం నిర్మాణాత్మకంగా సాగిందని మోడీ ట్వీట్
అమెరికా అధ్యక్షుడి హోదాలో తొలిసారి ఇండియాకు వచ్చిన బైడెన్

భేటీ అనంతరం బైడెన్‌కు ప్రధాని వ్యక్తిగత విందు మోడీ
నివాసంలో విందు స్వీకరించిన తొలి దేశాధ్యక్షుడు బైడెన్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తన నివాసంతో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. శనివారంనుంచి జరగనున్న జి20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడం కోసం బైడెన్ శుక్రవారం రాత్రి ఇక్కడికి చేరుకున్న కొద్ది సేపటికే ఈ సమావేశం జరగడం గమనార్హం.‘ అధ్యక్షుడు జో బైడెన్‌ను7, లోక్‌కళ్యాణ్ మార్గ్‌కు ఆహ్వానించినందుకు సంతోషిస్తున్నా. మా సమావే శం చాలా నిర్మాణాత్మకంగా జరిగింది. భార త్, అమెరికా దేశాల మధ్య ఆర్థిక, ప్రజల మ ధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు అంశాలపై మేము చర్చలు జరపగలి గాం. మా రెండు దేశాల మధ్య మైత్రి ప్రపం చ శాంతి సౌభాగ్యాలను పెంపొందించడంలో గొప్ప పాత్రను పోషించడం కొనసాగిస్తుంది’ అని సమావేశం అనంతరం మోడీ ట్విట్టర్‌లో ఉంచిన ఓ పోస్టులో పేర్కొన్నారు.

చర్చల్లో అమెరికా తరఫున ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్, విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ పాల్గొనగా, బారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీ య భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొన్నారు. కాగా చర్చల అనంతరం ప్రధాని మోడీ అధ్యక్షుడు జో బైడెన్‌కు వ్యక్తిగత విం దు ఇచ్చారు. కాగా అమెరికా అధ్యక్షుని హో దాలో తొలిసారి భారత్‌కు వచ్చిన బైడెన్‌కు విమానాశ్రయంలో విదేశాంగ శాఖ సహాయమంత్రి వికె సింగ్ స్వాగతం చెప్పారు. సా యంత్రం 7 గంటలకు బైడెన్ ప్రయాణిస్తున్న ఎయిర్‌ఫోర్స్ వన్ విమానం ఇందిరా గాంధి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుం ది. బైడెన్ వెంట అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్, ఆర్థిక మంత్రి జానెట్ ఎల్లెన్, జాతీ య భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్, ఇత ర ఉన్నతాధికారులున్నారు. ద్వైపాక్షిక భేటీ అనంతరం బైడెన్ హోటల్ మౌర్యలో బస చే యనున్నారు. ఇక్కడ అన్ని ఫ్లోర్లను అమెరికా సీక్రెట్ పర్వీస్ ఏజంట్లు ఇప్పటికే తమ అధీనంలోని తీసుకున్నారు. హోటల్‌లోని 14వ ఫ్లోర్‌లో బైడెన్ బస చేసే గది ఉంది. ఆ ఫ్లోర్ చేరడాని కి ప్రత్యేకంగా లిఫ్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఈ హోటల్‌లోని మొత్తం 400 గదులను అతిథుల కోసం బుక్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News