Monday, April 29, 2024

ఎంఎస్ స్వామినాథన్ భార్య మీనా స్వామి నాథన్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

MS Swaminathan wife Meena Swami Nathan no more

 

చెన్నై : వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌స్వామినాథన్ సతీమణి మీనా స్వామి నాథన్ సోమవారం కన్నుమూశారు. ఆమెవయసు 88 ఏళ్లు. శిశు విద్యారంగంలో ఆమె నిపుణురాలు. కార్యకర్త కూడా. లింగ సమానత్వం కోసం సుదీర్ఘ అధ్యయనం చేశారు. ఎంఎస్ స్వామినాధన్ రీసెర్చి ఫౌండేషన్ ఛైర్మన్‌గా కూడా మీనా ఉన్నారు. టీచర్‌గా, ఎడ్యుకేటర్‌గా రైటర్‌గా ఆమెకు గుర్తింపు ఉంది. చిన్నపిల్లల విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలు ఆమె రాశారు. కేంద్ర విద్యాబోర్డు అడ్వైజరీగా ఆమెను 1970 లో నియమించారు. ఆమె నివేదిక ఆధారం గానే 1975 లో ఐసిడిఎస్‌ను అమలు చేశారు.

టీచర్ల శిక్షణ కోసం మూడు మాన్యువల్స్‌ను అమె రాశారు. సెంటర్ ఫర్ వుమెన్స్ డెవలప్‌మెంట్ స్టడీస్ ఏర్పాటులో ఆమె వ్యవస్థాపక సభ్యురాలిగా ఉన్నారు. మీనా స్వామినాధన్ భర్త వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్టుగా సౌమ్యా స్వామినాథన్ చేస్తున్నారు. ఎకనామిక్స్‌లో మధుర స్వామినాథన్ ప్రొఫెసర్. బ్రిటన్‌లోని ఈస్ట్‌అంగ్లియా వర్శిటీలో నిత్యారావు డైరెక్టర్‌గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, సీఎం స్టాలిన్, మీనాస్వామినాథన్ మృతికి సంతాపం వెలిబుచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మీనా భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఆమె మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News