Monday, April 29, 2024

మూసీకి పూర్వవైభవం

- Advertisement -
- Advertisement -

ప్రక్షాళనకు ఆరేళ్లుగా
అనేక చర్యలు
కాళేశ్వర జలాలతో
మూసీనది ప్రక్షాళన
ఉస్మాన్‌సాగర్,
హిమాయత్‌సాగర్‌కు
700 క్యూసెక్కులు
కొండ పోచమ్మతో జంట జలాశయాల అనుసంధానం

Musi river history in telugu

ఎంఆర్‌డిసిఎల్‌తో రిజర్వాయర్లు

నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీటర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన నాలాలు చాలావరకు ఆక్రమణలకు గురయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మూసీరివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి (ఎంఆర్‌డిసిఎల్) ఆధ్వర్యంలో సుందరీకరణకు నడుంబిగించింది. ఇప్పటికే మూసీకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టాడాలను ప్రభుత్వం కూల్చివేయించింది. ప్రస్తుతం మూసీ పరివాహాక ప్రాంతాన్ని సర్వే చేయించింది. అందులో భాగంగా గండిపేట నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు, తూర్పువైపు ఉన్న గౌరెల్లి వరకు 47 కిలోమీటర్లు, హిమాయత్‌సాగర్ నుంచి బాపుఘాట్ వరకు 8 కిలోమీటర్లతో కలిపి మొత్తం 55 కిలోమీటర్ల మేర మూసీనదిని గుర్తించడానికి డ్రోన్‌లతో సర్వే చేపట్టింది. జీనో ఇండియా ప్రైవేటు లిమిటెడ్ ఈ సర్వే చేపట్టింది. ఇప్పటికే సర్వే జరపడంతో ఆక్రమణలు గుర్తించిన మూసీరివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రభుత్వానికి నివేదిక అందించడంతో మూసీ మురికిని వదిలించడానికి ప్రభుత్వం సమాయత్తం అయ్యింది.

హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల పరిధిలో…

ముఖ్యంగా మూసీ ప్రక్షాళన పూర్తయితే హైదరాబాద్, రంగారెడ్డి, -యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల పరిధిలో కాలుష్యజలాల పీడ వదలనుంది. నది పొడవునా చుట్టుపక్కల దోమల బెడద తప్పనుంది. ప్రస్తుతం మూసీ మురికికూపంలా తయారైనందున దాని పొడవునా వస్తున్న వ్యవసాయ దిగుబడులు ఆరోగ్యపరంగా ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రక్షాళన పూర్తయితే కొంతకాలంలో ఈ ప్రధాన సమ స్య తీరనుంది. విశ్వ నగరంగా అంతర్జాతీయ ఖ్యాతిని గడించి న హైదరాబాద్ నడిబొడ్డున మూసీ పారడం వల్ల పర్యాటకం గా అద్భుత శోభ రానుంది. లండన్‌లోని ఏథెన్స్, పారిస్‌లోని సెయిన్ నదుల ద్వారా ఆయా నగరాలకు పర్యాటకంగా, పర్యావరణపరంగా ఎంత ప్రయోజనం చేకూరుతుందో మూసీ ద్వారా హైదరాబాద్‌కు ఆ మహర్దశ పట్టనుంది.

Musi River

మనతెలంగాణ/హైదరాబాద్ : మూసీ అరవయ్యేండ్ల సమైక్య పాలనలో మురికికూపంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చారిత్రక మూసీ నదికి పూర్వ వైభవం తీసుకురానుంది. కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితుల్లో ప్రభుత్వం దానికి తిరిగి ఊపిరిలూదుతోంది. రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మూసీనది మురికిని వదిలించనుంది. మూసీ నది పరిరక్షణకు ఆరేళ్ల కాలంలో అనేక రకాల చర్యలు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గోదావరి-మూసీ అనుసంధానంతో ఈ చారిత్రక జీవనదికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల్లో కాళేశ్వరజలాల్ని నింపి మురికిలేని మూసీని సాక్షాత్కరింపజేసేందుకు సిఎం కెసిఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుతో డిజైన్ పూర్తిచేశారు.
సాగర్ నుంచి కాళేశ్వర జలాలను తరలించేలా అలైన్‌మెంట్
ఎత్తిపోతల పథకంలో భాగంగా పదిహేను టిఎంసిల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ నుంచి కాళేశ్వ ర జలాలను జంట జలాశయాలకు తరలించేలా అలైన్‌మెంట్ రూపొందించారు. కొండ పోచమ్మసాగర్ సముద్ర మట్టానికి 618 మీటర్ల ఎత్తులో ఉంది. గోదావరి బేసిన్‌లోనే ఇది గరిష్ట ఎత్తు. ఈ రిజర్వాయర్ నుంచి 127 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వను నిర్మిస్తున్నారు. ఇది పూర్తిస్థాయిలో గ్రావిటీ కాల్వ కాగా 27వ కిలోమీటర్ వద్ద మూసీ దిశగా కాళేశ్వరజలాల్ని మళ్లీంచనున్నారు. వాస్తవంగా సంగారెడ్డి కాల్వ గరిష్ట వరద ప్రవాహ సామర్థ్యం 5054 క్యూసెక్కులు. ఇందులో సాగునీటి కి 4,354 క్యూసెక్కులు పోగా మిగిలిన 700 క్యూసెక్కులను హైదరాబాద్‌లోని జంట జలాశయాలకు తరలించనున్నారు.

వికారాబాద్ జిల్లా అనంతగిరిలో పుట్టి…

మూసీ వికారాబాద్ జిల్లా అనంతగిరి నుంచి ప్రారంభమై నల్లగొండ మీదుగా కృష్ణానదిలో కలుస్తోంది. ఇది రెండు ఉపనదులుగా విడిపోయి మూసీ, ఈసాలుగా నగరం వైపు వరద ఉధృ తి పయనిస్తుంది. 1908 సంవత్సరంలో వచ్చిన వరదలను దృష్టిలో ఉంచుకొని అప్పటి నిజాం నవాబు మూసీ, ఈసీల వరద ఉధృతిని ఆపడానికి గండిపేట వద్ద మూసీనదిపై (ఉస్మాన్‌సాగర్)ను, ఈసానదిపై (హిమాయత్‌సాగర్) వద్ద రిజర్వాయర్లను నిర్మించారు. అవి నిండిన తరువాత ఆ రెండు నదులు లంగర్‌హౌస్ వద్ద ఒకటిగా కలుస్తాయి. అనంతరం అక్కడినుంచి వాడపల్లి మీదుగా కృష్ణానదిలో మూసీ కలుస్తుంది. నిజాం నవాబు రిజర్వాయర్లతో పాటు నాలాలను పదుల మీట ర్ల వెడల్పుతో నిర్మించారు. అప్పట్లో నిర్మించిన నాలాలు ఇప్పు డు ఆక్రమణలకు గురయ్యాయి. దీంతో వాటి పరిస్థితి ఇప్పుడు మరింత అధ్వాన్నంగా తయారయ్యింది. వర్షాలు వచ్చినప్పు డు వరదనీరుతో మూసీ ముందుకు కదల్లేక బస్తీలను ముంచెత్తుతోంది. ఒకప్పుడు తాగునీరు, సాగునీరు అందించిన మూసీనది పక్కనుంచి వెళ్లాలంటే గతంలో ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఎదులాబా ద్ మరియు సూర్యాపేటకు చెందిన ప్రజలు కొన్ని సంవత్సరాల క్రితంవరకు మూసీ నీటిని తాగడానికి ఉపయోగించే వారు. ప్రస్తుతం మూసీలో వ్యర్థ రసాయనాలు ఎక్కువగా కలుస్తుండడంతో వాటిని వాడడం మానేశారు. మూసీనది వలన కృష్ణానది సైతం కలుషితమవుతుందని అక్కడి ప్రజలు ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. పర్యావరణ వేత్త లు మూసీ ఆక్రమణలతో పాటు కలుషితమవుతున్న తీరుపై ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం వాడుకోవడానికి కూడా ఉపయోగంలేదని, ఆ నీటితో పంటలను పండించవద్దని పర్యావరణ వేత్తలు పేర్కొనడంతో ఆ నీటిని ప్రస్తుతం ప్రజలకు వినియోగంలోకి తీసుకురావడంతో పాటు పంటలకు ఈ నీరు ఉపయోగించే విధంగా ప్రభుత్వం ముందుకెళుతోంది.

Musi River High Flooded in Yadadri

నీటి మళ్లింపు ఇలా…

సంగారెడ్డి కాల్వ 27వ కిలోమీటర్ నుంచి మళ్లీంచే కాళేశ్వరజలాల్ని సమీపంలో ఉన్న రావిల్‌కోల్ చెరువుకు తరలిస్తారు. అక్కడి నుంచి 52 కిలోమీటర్ల గ్రావిటీ కాల్వ ద్వారా జంట జలాశయాల్లోకి తరలించనున్నారు. గండిపేట (ఉస్మాన్‌సాగ ర్) ఎఫ్‌ఆర్‌ఎల్ అంటే సముద్ర మట్టానికి 545మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో 618 మీటర్ల ఎత్తు నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా జలాలు ఉస్మాన్‌సాగర్‌కు తరలించడం సులభమవుతుంది. హిమాయత్‌సాగర్ సముద్ర మట్టానికి (ఎఫ్‌ఆర్‌ఎల్) 537.25 మీటర్ల ఎత్తులో ఉంది. దీంతో గండిపేటకు వచ్చిన జలాల్ని సులువుగా హిమాయత్‌సాగర్‌లోకి మళ్లీంచవచ్చు. దీనికి సంబంధించి గతంలో పైపులైన్ కూడా వేశాది. ఒకవేళ దాని ద్వారా సాధ్యం కాకపోయినా గండిపేట నుంచి గ్రావిటీ కాల్వ ద్వారా హిమాయత్‌సాగర్‌లోకి జలాలను తరలించవచ్చు.

ప్రారంభమైన పనులు

కొండపోచమ్మ సాగర్ నుంచి సాగునీటి జలాల్ని అందించే సంగారెడ్డి కాల్వ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నా యి. రావిల్‌కోల్ చెరువు నుంచి గండిపేటకు జలాలను తరలిం చే పనుల్ని జలమండలి చేపట్టాల్సి ఉంది. ఈ మేరకు త్వరలో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. కొండపోచమ్మ సాగర్ నుంచి జంట జలాశయాల వరకు 85 కిలోమీటర్ల కాల్వ పనులకుగాను 27 కిలోమీటర్ల సంగారెడ్డి కాల్వ పనులను జల వనరుల శాఖ పూర్తి చేస్తుంది. మిగిలిన 52 కిలోమీటర్ల కాల్వ పనులను జలమండలి చేపట్టాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తయితే గండిపేట, హిమాయత్‌సాగర్‌లో మూడున్నర టిఎంసిల చొప్పున కాళేశ్వరజలాలు నిండనున్నాయి.

ప్రయోజనాలు

కాళేశ్వర జలాలను జంట జలాశయాలకు తరలించడం వల్ల చారిత్రక చెరువులకు పూర్వ వైభవం వస్తుంది. రెండు జలాశయాల్లో నిత్యం నీటి నిల్వ ఉండటం వల్ల చుట్టూ -పదిహేను కిలోమీటర్ల పరిధిలో భూగర్భజలాలు పెరుగుతాయి. రెండు జలాశయాల్లోని నీటితో అతి తక్కువ ఖర్చుతో అనేక ప్రాంతాలకు సురక్షితమైన తాగునీటిని అందించవచ్చు. జంట జలాశయాల్లోకి గోదావరిజలాలు రావడం వల్ల మూసీలోకి జలాల్ని వదిలి మురికిని తొలగించవచ్చు. దీంతో మురుగురహిత మూసీ సాక్షాత్కారం కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News