Monday, April 29, 2024

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి జాతీయ స్థాయి అవార్డు

- Advertisement -
- Advertisement -

Heavy rain hits coal production in Singareni

మన తెలంగాణ/హైదరాబాద్ : మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద గల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం అవలంబిస్తున్న పర్యావరణ హిత చర్యలకు గుర్తింపుగా జాతీయ స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల కేటగిరీలో మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంది. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వినియోగిస్తున్నందుకు ముంబాయికి చెందిన ప్రముఖ మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ సంస్థ ఈ అవార్డును అందజేసింది.

కాగా దీనిని హైదరాబాద్ సింగరేణి భవన్‌లో ఛైర్మన్, ఎండి ఎన్.శ్రీధర్ తన చేతుల మీదుగా డైరెక్టర్ (ఇ అండ్ ఎం) డి.సత్యనారాయణ రావుకు అందజేస్తూ ప్లాంట్ అధికారులు, సిబ్బందికి తన అభినందనలు తెలిపారు. సాధారణంగా 500 మెగా వాట్ల అంతకు ఎక్కువ స్థాయి గల థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒక మెగా వాట్ విద్యుత్ ఉత్పాదనకు 3 క్యూబిక్ మీటర్ల వరకు నీటిని వినియోగించవచ్చని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారి నిబంధనలు ఉన్నాయి. కానీ సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో గల ప్రత్యేక ఏర్పాట్లు, తీసుకున్న చర్యల కారణంగా ఈ నీటి వినియోగం 2.3 క్యూబిక్ మీటర్ల వరకు మాత్రమే ఉంటోంది. ముంబయిలో జరిగిన మిషన్ ఎనర్జీ ఫౌండేషన్ వారు ఈ ప్రత్యేకతను గుర్తిస్తూ దక్షిణ భారత దేశంలో గల 500 మెగావాట్లు అంతకుమించిన థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అత్యంత పొదుపుగా నీటిని వాడుతున్న సంస్థగా ఎన్‌టిపిపిని గుర్తించి అవార్డును ప్రకటించారు.

సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో హై కాన్సన్‌ట్రేటెడ్ స్లర్రీ డిస్పోజల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం, ఎఫ్లుయెంట్ ట్రీట్‌మెంట్ ఫ్లాంట్ ద్వారా నీటి పునర్వినియోగం జరపడం, నిరంతరాయంగా నీటి వాడకం పై పర్యవేక్షణ ఉండటంతో సమర్థవంతంగా నీటిని పొదుపు చేయగలుగుతోంది. ఈ ఏడాది సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఇది మూడో అవార్డు కావడం విశేషం. గతంలో అత్యుత్తమ ఫ్లైయాష్ వినియోగానికి సంబంధించి ఏప్రిల్‌లో అత్యుత్తమ ఆపరేషనల్ ప్లాంట్ గా జూన్‌లో ఎన్‌టిపిపికి పురస్కారాలు లభించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News