Monday, April 29, 2024

సహజ వాయు సంస్కరణ

- Advertisement -
- Advertisement -

                     Natural Gas Price Prediction        పెట్రోలియం, డీజెల్ మాదిరిగానే భవిష్యత్తులో గ్యాస్ ధరలకు సైతం పట్టపగ్గాలు లేకుండా పోతాయా? కేంద్ర మంత్రివర్గం బుధవారం నాడు తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఈ ప్రశ్నకు అవకాశం కల్పిస్తున్నది. దేశంలో సహజ వాయువు ఉత్పత్తి చేస్తున్న ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లోని సంస్థల గ్యాస్‌ను వాటి అనుబంధ సంస్థలు కూడా ఇ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేసుకొని స్వేచ్ఛా విపణిలో అమ్ముకొనే అవకాశాన్ని కలిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. దీని వల్ల ప్రభుత్వ రంగంలోని ఒఎన్‌జిసి(ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్‌తో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) కెయిర్న్ ఇండియాలు కూడా వాటి గ్యాస్ ఉత్పత్తులను అనుబంధ సంస్థల ద్వారా కొనుక్కొనే అవకాశాన్ని పొందుతాయి. సహజ వాయు రంగంలో పోటీ ధరల వ్యవస్థకు ప్రాణం పోయడానికి ఈ నిర్ణయం తీసుకున్నది.

ఎలెక్ట్రానిక్ వేలం పద్ధతిని ఇందు కోసం ప్రవేశపెట్టడానికి నిర్ణయించింది. దీని ప్రభావంతో దేశంలో రోజుకు అదనంగా 40 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్‌సిఎండి) గ్యాస్ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అది ఈ రంగంలో వ్యాపారం విశేషంగా పుంజుకునేలా చేస్తుందని భావిస్తున్నారు. ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలో 8 లేదా 9 రోజుల్లో వినియోగించే సిఎన్‌జి కిమ్మత్తు గ్యాస్ ఉత్పత్తి అదనంగా ఒక్క రోజులోనే సాధ్యమవుతుందని చెబుతున్నారు. స్థూలంగా చెప్పాలంటే దేశంలో వెలికి తీసే గ్యాస్ నుంచి రిలయన్స్, వేదాంత వంటి భారీ ప్రైవేటు సంస్థలు విశేషంగా లాభపడడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది. గతంలోనే చిన్న, మధ్యతరహా ప్రైవేటు రంగ గ్యాస్ బ్లాకుల నుంచి తీసే సహజ వాయువుకు స్వేచ్ఛా విపణిలో అమ్ముకునే అవకాశం కల్పించినప్పటికీ ఒఎన్‌జిసి ఉత్పత్తులపై నిషేధం ఉన్నందున దేశంలో పోటీ ధరల వ్యవస్థ ఏర్పాటు కాలేదు. ఇప్పుడు ప్రైవేటు సంస్థలతో పాటు ఒఎన్‌జిసికి కూడా అనుబంధ కంపెనీల ద్వారా సొంత గ్యాస్‌ను కొనుక్కొని అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తున్నందున ప్రైవేటు సంస్థలు బాగా ప్రయోజనం పొందే అవకాశం కలుగుతుంది. వేదాంత గ్రూపు పరిశ్రమలు ఇక నుంచి రాజస్థాన్‌లోని కెయిర్న్ ఇండియా ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్ వేలంలో పాల్గొవచ్చు.

అలాగే హెచ్‌టిసిఎల్, ఎంఆర్‌పిఎల్, ఒపిఎఎల్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో గల ఒఎన్‌జిసి ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌తోపాటు దాని దామన్, కచ్ ప్రాజెక్టుల ఉత్పత్తుల వేలంలో కూడా పాల్గొనే అవకాశం కలుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లోని రిలయన్స్ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే గ్యాస్‌ను కూడా ఆ సంస్థకు చెందిన చమురు శుద్ధి, పెట్రోలియం విభాగాలు వేలంలో కొనుగోలు చేసే వీలు కలుగనున్నది. ఇప్పటి వరకు మూల సంస్థల ఉత్పత్తుల వేలంలో వాటి అనుబంధ సంస్థలు పాల్గోవడం పై నిషేధం ఉన్నది. అందుచేతనే పెట్రోలియం కంపెనీలు ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాయి. 2017లో రిలయన్స్ సంస్థ మధ్యప్రదేశ్‌లోని తన ప్రాజెక్టు నుంచి ఉత్పత్తి అయిన గ్యాస్ అంతటినీ తానే కొనుగోలు చేసిందన్న ఆరోపణ రావడంతో దానిపై దర్యాప్తును కూడా ఆదేశించారు. అయితే ఆ దర్యాప్తు వల్ల ఆశించిన ప్రయోజనం రాలేదు. అందుచేత దొడ్డి దారి కొనుగోళ్లకు స్వస్తి చెప్పించి, అనుబంధ పెట్రోలియం సంస్థలు కూడా గ్యాస్ వేలంలో పాల్గోడంపై నిషేధాన్ని ఎత్తివేయడమే మంచిదని కేంద్ర ప్రభుత్వం భావించి తాజా నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తున్నది. ఇంతవరకు ఈ సంస్థలు తాము ఉత్పత్తి చేసే గ్యాస్‌ను ప్రభుత్వ రంగంలోని గెయిల్ ఇండియాకు మాత్రమే విక్రయించవలసి వచ్చేది.

ఇక ముందు అటువంటి నిబంధన ఉండదు. ఎక్కడ ఎక్కువ ధర వస్తే అక్కడ అమ్ముకునే అవకాశం ఈ కంపెనీలకు కలుగుతుంది. ప్రధాని మోడీ ‘తక్కువ ప్రభుత్వం ఎక్కువ పాలన’ అనే సిద్ధాంతాన్ని ఎంచుకొని ప్రభుత్వ రంగాన్ని దాదాపు మొత్తంగా ప్రైవేటుకు అప్పగించే వైపు అడుగులు వేయడం ప్రారంభించి చాలా దూరం వచ్చింది. గత ప్రభుత్వాలు జాతీయీకరణకు ప్రాధాన్యం ఇవ్వగా, ప్రధాని మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అందుకు పూర్తి విరుద్ధమైన పంథాను తొక్కుతున్నది. అందులో భాగంగానే పెట్రోలియం రంగంలో చిట్ట చివరి సంస్కరణ అయిన తాజా నిర్ణయాన్ని తీసుకున్నది. భవిష్యత్తులో సామాన్యులు ఉపయోగించే గ్యాస్ కూడా మరింత ప్రియమైపోయే రోజులు వస్తాయనే భయాలకు ఇది చోటు కల్పించడం సహజం. సహజ వాయువును పోటీ ధరలకు అమ్ముకునే అవకాశం కల్పించడం వల్ల దాని మీద ఆధారపడిన విద్యుత్తు రంగంపై అధిక భారం పడుతుంది. దేశంలో 25 వేల మెగా వాట్ల స్థాపిత సామర్థం గల గ్యాస్ ఆధారిత విద్యుత్తు ప్లాంట్లు ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News