Saturday, April 27, 2024

నీరాలో పోషక విలువలు అధికం

- Advertisement -
- Advertisement -

Neera is high in nutrients

క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తి ఉంది
ఇది తాగితే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా అరికట్టవచ్చు
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో తెలిపిన
ఉస్మానియా శాస్త్రవేత్తల బృందం

హైదరాబాద్: నీరాలో (పోషక విలువలు) క్యాన్సర్ వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉన్నాయని, దీనిలో (క్యాన్సర్ ప్రివెంటీవ్ ఏజెంట్స్ లైక్ బ్యాక్టీరియా అండ్ ఎస్ట్) పుష్కలంగా ఉందని శాస్త్రవేత్తల బృందం రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో తెలిపింది. దీంతోపాటు కిడ్నీ స్టోన్ నివారణకు సంబంధించి (ఆక్సాలేట్ డెకర్ బాక్సిలేస్ ఎంజైమ్స్) సంవృద్ధిగా ఉండడంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉపయోగపడుతుందని తమ అధ్యయనంలో తేలిందని మంత్రికి వారు వివరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మైక్రోబయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్ డా. బి. భీమా నేతృత్వంలో డా. చంద్రశేఖర్, డా. శ్రీనివాస నాయక్‌ల శాస్త్రవేత్తల బృందంతో పాటు వట్టికూటి రామారావు తదితరులు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, డా. భీమా నేతృత్వంలో వచ్చిన శాస్త్రవేత్తలతో చర్చించారు. డా. భీమా మైక్రోబయాలజీ రంగంలో 8 సంవత్సరాల నుంచి పరిశోధనలు చేసి పిహెచ్‌డి సాధించగా, అమెరికాలో పిడిఎఫ్‌ను పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం -మైక్రో బయాలజీ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆయన తన బృందంలో కలిసి నీరాపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు.

డా. భీమా బృందానికి అభినందనలు

ఈ పరిశోధనలో తాటి, ఈత చెట్ల నుంచి సేకరించిన నీరా సుమారు ఆరు నెలల పాటు నిల్వ ఉండే విధంగా ప్రాసెస్ చేసి నీరాను సహజ సిద్ధంగా ఉండేలా చర్యలు చేపట్టామని శాస్త్రవేత్తలు మంత్రితో పేర్కొన్నారు. నీరాలో ఇంత మ్లైనా సుగాణాలు ఉన్నాయని తన పరిశోధన ద్వారా తెలియచెప్పడంతో పాటు నీరాను దీర్ఘకాలం పాటు నిల్వ ఉండేలా సంవత్సర కాలంగా పరిశోధనలు చేసి మెరుగైన ఫలితాలు సాధించిన డా. భీమా బృందాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. డా.భీమాతో ఆయన బృందం సేవలను నీరా ప్రాజెక్టులో ఉపయోగించుకుంటా మని మంత్రి తెలిపారు.

ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తాం

రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తి ప్రోత్సాహాన్ని అందించాలన్న లక్ష్యంతో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. అందులో భాగంగా 20 కోట్ల రూపాయల వ్యయంతో హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో నీరా కేఫ్‌ను ఏర్పాటు పనులను శరవేగంగా జరుగుతున్నాయన్నారు. భవిష్యత్ తరాలకు ఆరోగ్య ప్రదాయిని నీరాను అందిం చాలన్న సంకల్పంతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉస్మానియా విశ్వవిద్యాలయంకు చెందిన డా. భీమా బృందానికి ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తామన్నారు.

డా. భీమా నేతృత్వంలో చేసిన పరిశోధనలో నీరా సహజ సిద్ధంగా దీర్ఘకాలం పాటు సహజత్వం కోల్పోకుండా వ్యాధి నిరోధక శక్తి ని కలిగి నిల్వ ఉండేలా తయారు చేసిన నీరా బాటిల్స్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు శాస్త్రవేత్తలు అందించారు. త్వరలో నీరాపై అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు అనుబంధ ప్రభుత్వ శాఖల అధికారులను ఈ సమావేశంలో పాల్గొనేలా ఆహ్వానించి నీరా ఉత్పత్తి కి, నీరా కేఫ్ ప్రారంభించడానికి కార్యాచరణను రూపొందిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News