Monday, April 29, 2024

వార్నర్ సేనపై ప్రశంసల వర్షం

- Advertisement -
- Advertisement -

Netizens praises on SRH for enter into Playoffs

దుబాయి: అసాధారణ ఆటతో ప్లేఆఫ్‌కు చేరుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచి నాకౌట్ రేసుకు చేరుకోవడంతో అభిమానలు ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వరుస ఓటములతో ప్లేఆఫ్ అవకాశాలు అంతంత మాత్రంగానే కనిపించిన హ్యాట్రిక్ విజయాలతో వార్నర్ సేన ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ముంబైతో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఏకంగా పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అంతుకుముందు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లను కూడా చిత్తు చేసింది. ఇలా వరుస విజయాలతో ప్లేఆఫ్‌కు అర్హత సాధించడంతో జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యింది.

పంజాబ్‌పై స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించకుండా ఘోర పరాజయం పాలు కావడంతో సన్‌రైజర్స్ ముందుకు పోవడం కష్టమేనని అందరూ భావించారు. కానీ సమష్టి పోరాటంతో హైదరాబాద్ వరుస విజయాలు సాధించి అనూహ్యంగా నాకౌట్ రేసులో నిలిచింది. బెంగళూరుతో జరిగే ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ గెలువాలనే పట్టుదలతో కనిపిస్తోంది. బౌలింగ్‌లో సన్‌రైజర్స్ చాలా బలంగా మారింది. సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్, నటరాజన్ తదితరులు అద్భుతంగా రాణిస్తున్నారు. అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌లను సయితం గడగడలాడిస్తున్నారు. దీంతో హైదరాబాద్‌కు ఎదురే లేకుండా పోయింది. కచ్చితంగా గెలవాల్సిన మూడు మ్యాచుల్లోనూ జయకేతనం ఎగుర వేసిన హైదరాబాద్‌పై మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

Netizens praises on SRH for enter into Playoffs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News