Monday, April 29, 2024

కొత్త రకం కరోనా వైరస్

- Advertisement -
- Advertisement -

New type of virus Strain is booming in Corona

 

దేశదేశాల్లో కలవరం
బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో వెలుగు చూసిన కొత్త మహమ్మారి స్ట్రెయిన్
త్వరగా వ్యాపిస్తున్న వైరస్
బ్రిటన్‌లో లాక్‌డౌన్, క్రిస్మస్
వేడుకల రద్దు, బ్రిటన్,
దక్షిణాఫ్రికా విమానాలపై
నిషేధం విధించిన యూరప్
భారత్ అప్రమత్తం, సమీక్ష

బెర్లిన్: కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌లు వస్తున్నాయనని ఊపిరిపీల్చుకుంటున్న తరుణంలో ప్రపంచాన్ని మరో పిడుగులాంటి వార్త కలవరపెడుతోంది. కరోనాలో కొత్త రకం వైరస్ స్ట్ట్రెయిన్ విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇది బ్రిటన్, దక్షిణాఫ్రికా దేశాల్లో వెలుగుచూడడమే కాకుండా, వేగంగా విస్తరిస్తుందన్న నివేదికల నేపధ్యంలో ఆయా దేశాలు అప్రమత్తమవుతున్నాయి. బ్రిటన్ ఇప్పటికే లాక్‌డౌన్ విధించడమే కాకుండా క్రిస్మస్ వేడుకలను కూడా రద్దు చేసింది. ఇక బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై పలు యురోపియన్ యూనియన్ దేశాలు నిషేధాజ్ఞలు విధించాయి. నెదర్లాండ్, బెల్జియం దేశాలు ఆయా దేశాల విమానాలపై నిషేధం విధించాయి. ఈ మేరకు ఆయా దేశాల ప్రధానులు ఆదివారంనాడు ఒక ప్రకటన విడుదల చేశారు. జర్మనీ ప్రభుత్వం కూడా దీనిపై తీవ్రంగా పరిశీలిస్తోంది.

అక్కడి నుంచి వచ్చే విమానాలపై ఇప్పటికే దృష్టి సారించినట్లు జర్మనీ ఆరోగ్య విభాగం అధికారులు మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ స్ట్రెయిన్‌కు సంబంధించిన కేసులేవీ తమ దేశంలో గుర్తించలేదని జర్మనీలో ప్రముఖ వైరాలజీ విభాగ వైద్యుడు క్రిస్టియన్ డ్రోస్టెన్ వెల్లడించారు. యూకేలో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ 70శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు. బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హెన్‌కాక్ మాట్లాడుతూ దురదృష్టవశాత్తూ కొత్త రకం స్ట్రెయిన్‌పై నియంత్రణ కోల్పోయామని, అందుకే దక్షిణ ఇంగ్లాండ్‌లో క్రిస్‌మస్ వేడుకలపై కఠినంగా నిషేధాజ్ఞలు విధించినట్లు చెప్పారు.

యూకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటలకే బెల్జియం, నెదర్లాండ్ దేశాలు ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించడం గమనార్హం. మరోవైపు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. బ్రిటన్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తున్నామని, కొత్త రకం వైరస్ స్ట్రెయిన్‌పై సమాచారాన్ని ప్రపంచానికి పంచుకుంటామని డబ్లుహెచ్‌ఓ అధికారులు వెల్లడించారు. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో కొత్త రకం వైరస్ సెప్టెంబర్ మాసంలో గుర్తించినట్లు, అప్పటి నుంచి క్రమంగా విస్తరిస్తుందని డబ్లుహెచ్‌ఓ అధికారి బిబిసికి వెల్లడించారు. ఏదిఏమైనా మరిన్ని అధ్యయనాలు సాగుతున్నాయని పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News