Monday, April 29, 2024

కివీస్ అద్భుత గెలుపు

- Advertisement -
- Advertisement -

New Zealand won against west indies

 

ఆక్లాండ్: వెస్టిండీస్‌తో శుక్రవారం జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచ్‌లో ఆతిథ్య న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. వర్షం వల్ల మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం 15.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. కివీస్ బ్యాట్స్‌మెన్ సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు. డెవాన్ కాన్వే ఐదు ఫోర్లు, సిక్స్‌తో 41 పరుగులు చేశాడు. చెలరేగి ఆడిన జేమ్స్ నిషమ్ 24 బంతుల్లోనే మూడు సిక్సర్లు, ఐదు ఫోర్లతో అజేయంగా 48 పరుగులు సాధించాడు.

విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన సాంట్నర్ మూడు సిక్సర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. దీంతో కివీస్ భారీ లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ను కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఆదుకున్నాడు. అసాధారణ బ్యాటింగ్ కనబరిచిన పొలార్డ్ 37 బంతుల్లోనే 8 భారీ సిక్సర్లు, 4 ఫోర్లతో అజేయంగా 75 పరుగులు చేశాడు. ఓపెనర్ ఫ్లెచర్ 14 బంతుల్లోనే మూడు సిక్స్‌లు, మరో 3 ఫోర్లతో 34 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. మిగిలిన వారిలో ఫబియాన్ అలెన్ (30) పరుగులు సాధించాడు. దీంతో విండీస్ భారీ స్కోరు సాధించింది. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ 21 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి మ్యాచ్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News