Monday, April 29, 2024

కోడి కత్తి ఘటనలో కుట్ర కోణం లేదు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌‌‌పై కోడి కత్తి దాడికి సంబంధించిన విచారణ ఎన్‌ఐఎ కోర్టులో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గత విచారణ సందర్భంగా ఏప్రిల్ 10వ తేదీన సిఎం జగన్‌ను విచారణకు హాజరు కావాలని కోర్టు కోరిన సంగతి తెలిసిందే. అయితే తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునివ్వాలని, అడ్వకేట్ కమిషనర్ ద్వారా సాక్ష్యాధారాలను నమోదు చేసేందుకు అనుమతించాలని సిఎం జగన్ కోర్టును అభ్యర్థించారు.

అలాగే కోడిపందాల కోసం ఉపయోగించే కత్తిని ఉపయోగించి తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించి లోతైన దర్యాప్తు జరపాలని ఎన్‌ఐఎను ఆదేశించాలని సిఎం జగన్ మరో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లో సిఎం జగన్ పలు అంశాలను ప్రస్తావించారు. ఎన్‌ఐఎ కోర్టు ఈ పిటిషన్లను ఏప్రిల్ 13న విచారణకు స్వీకరించనున్నట్టుగా తెలిపింది. ఈ క్రమంలోనే గురువారం ఎన్‌ఐఎ కోర్టులో విచారణ జరిగింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఐఎ కౌంటర్ దాఖలు చేసింది.

Also Read: కెసిఆర్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే నాపై దాడి: ఎమ్మెల్సీ కవిత

కోడికత్తి కేసులో కుట్రలేదని ఎన్‌ఐఎ తెలిపింది. రెస్టారెంట్ యజమాని హర్షవర్దన్‌కు ఘటనతో సంబంధం లేదని పేర్కొంది. నిందితుడు శ్రీనివాసరావు టిడిపి సానుభూతి పరుడు కాదని తేలిందని చెప్పింది. కోర్టులో విచారణ ప్రారంభమైనందుకు ఇంకా దర్యాప్తు అవసరం లేదని తెలిపింది. జగన్ వేసిన పిటిషన్‌ను కొట్టవేయాలని కోర్టును అభ్యర్థించింది. అయితే వాదనలకు సమయం కావాలని జగన్ తరఫున న్యాయవాదులు కోరారు. దీంతో కోర్టు ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News